బరువు తగ్గాలనుకుంటున్నారా ?? ఉదయం అల్పాహారంలో స్మాల్ ఛేంజెస్ ప్లీజ్
అధిక బరువుతో బాధ పడుతున్నారా? బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారంలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అల్పాహారంపై చేసిన అధ్యయనంలో కీలక విషయాలు కనుగొన్నారు.
మహిళలు, పురుషుల జీవక్రియల తీరుతెన్నులను పరిశీలించి ఓ అంచనాకు వచ్చారు. వివిధ రకాల ఆహారాలకు శరీరం స్పందించే తీరును గుర్తించారు. కార్బోహైడ్రేట్ల ద్వారా పురుషులకు శక్తి అందుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. మహిళలు ఆహారం తీసుకున్న వెంటనే ఎక్కువగా కొవ్వును శరీరంలో నిల్వ చేసుకోవడమే కాదు.. ఉపవాస సమయంలో దాన్ని ఎక్కువగా ఖర్చుచేసుకోగలరు అని పరిశోధనకారులు తేల్చారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తిన్న వెంటనే జీవక్రియ స్పందన ఎలా ఉంటుందన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. జీవక్రియలో స్త్రీ-పురుష సంబంధ వైరుధ్యాలు స్వల్పకాల ఉపవాస సమయంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళల కాలేయం, అడిపోస్ కణజాలంలో వైరుధ్యాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ఆధారంగా మహిళలు కొవ్వును కరిగించుకుంటున్నారు. మగవారితో పోలిస్తే మహిళల కాలేయం.. ఎక్కువ పరిమాణంలో గ్లిజరాల్‌ను గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియ కోసం మళ్లిస్తోంది. గ్లూకోనియోజెనిసిస్ అనేది ఒక జీవ ప్రక్రియ. ఇందులో కార్బోహైడ్రేటేతర వనరుల నుంచి గ్లూకోజ్ ఉత్పత్తవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నిర్దేశిత రీతిలో ఉంచడానికి ఈ క్రియ చాలా కీలకం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: ఆ టీవీ సీరియల్ అంటే నయనతారకు ఎందుకంత ఇష్టం ??
బాలీవుడ్ ‘రామాయణ’పై అఫీషియల్ అప్‌డేట్
49 ఏళ్ళకి పెళ్ళికి సిద్ధమైన టాప్ హీరోయిన్