AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..జనగామలో ఓ రేంజ్‌ సెలబ్రేషన్స్..!

Donald Trump: ట్రంప్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది..జనగామలో ఓ రేంజ్‌ సెలబ్రేషన్స్..!

Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 07, 2024 | 6:38 PM

Share

నవంబర్ 5న జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయం సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనను పలువురు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం గతంలో విగ్రహాలు కూడా కట్టించారు.

అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జనగామ జిల్లాలో ట్రంప్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ విగ్రహానికి అభిషేకాలు చేశారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో డోనాల్డ్ ట్రంప్ విగ్రహానికి అభిషేకాలు చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ తన ఇంటి ఆవరణలో నిర్మించుకున్న డోనాల్డ్ ట్రంప్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ట్రంప్ వీరాభిమాని కృష్ణ అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం అకాల మరణించారు. బుస కృష్ణ ఇంటినిండా తన రక్తంతో రాసుకున్న డోనాల్డ్ ట్రంప్ నామస్మరణం కూడా ఉంది. డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగుండాలి, మంచి పరిపాలన చేయాలని గతంలో కృష్ణ రక్తాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం చేసి సంగతి తెలిసిందే. తాజాగా స్థానికులు ఆ విగ్రహం వద్దకు స్థానికులు వెళ్లి సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Nov 07, 2024 04:16 PM