Train Accident: ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు..
Train Accident: ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఢీల్లీ నుంచి గోవాకు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు...
Train Accident: ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఢీల్లీ నుంచి గోవాకు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గల సోరంగ మార్గంలో పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. పట్టాలపై రాయి పడటం కారణంగా రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు ప్రకటించారు.
రాజధాని ఎక్స్‌ప్రెస్(02414) ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి గోవాలోని మడ్గావ్ వెళ్తున్న సమయంలో ముంబై నుంచి సుమారు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బూడ్ సొరంగం లోపల రైలు పట్టాలు తప్పింది. సరిగ్గా తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై రాయి పడిన కారణంగా రైలు లోకోమోటివ్ ఫ్రంట్ వీల్ పట్టాలు తప్పిందని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పట్టాలు తప్పిన రైలును సరిచేసి మార్గా్న్ని యధావిధిగా చేశారు. కాగా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read:
Ram Gopal Varma: PM అయితే అలా చేస్తా … యాంకర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..