DRDO Pinaka Rockets: పినాక రాకెట్ల ప్రయోగాలు విజయవంతం: డీఆర్డీవో

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శనివారం నాడు పినాక రాకెట్లను పరీక్షించింది. పినాక రాకెట్లు అనుకున్న మేరకు సత్ఫలితాలను అందించాయని డీఆర్‌డీవో పేర్కొంది.

DRDO Pinaka Rockets: పినాక రాకెట్ల ప్రయోగాలు విజయవంతం: డీఆర్డీవో
Drdo Pinaka Rockets
Follow us

|

Updated on: Jun 26, 2021 | 11:29 AM

DRDO Pinaka Rockets: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శనివారం నాడు పినాక రాకెట్లను పరీక్షించింది. పినాక రాకెట్లు అనుకున్న మేరకు సత్ఫలితాలను అందించాయని డీఆర్‌డీవో పేర్కొంది. మొత్తం 25 రాకెట్లను ప్రయోగించారు. అన్నీ కూడా విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని పేర్కొంది. సామర్థ్యం పెంచిన తరువాత వీటిని టెస్టు చేశారు. మొత్తానికి సామర్థ్యం పెంచిన తరువాత పినాక రాకెట్లు విజయవంతం కావడంతో డీఆర్డీవో వర్గాలు సంతోషంలో మునిగిపోయాయంట.

గత రెండు రోజులుగా ఒడిశాలోని చాందీపూర్ లో గల టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్షలు చేపట్టినట్లు డీఆర్‌డీవో తెలిపింది. ఈమేరకు పలు రాకెట్లకు నిర్ధేశించిన వేర్వేరు దూరాల్లోని టార్గెట్‌లను విజయవంతంగా చేరుకున్నాయంట. పినాక రాకెట్ 45 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించాయంట. కాగా, ఇండియన్ ఆర్మీ సూచనల మేరకు పినాక రాకెట్ లో పలు మార్పులు చేసింది. టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో పినాక రాకెట్ల కక్ష్యను డీఆర్డీవో పరిశీలించింది. ఈమేరకు అనుకున్న ఫలితాలు ఇవ్వడంతో.. త్వరలోనే ఆర్మీకి అప్పగించనున్నట్లు పేర్కొంది. ప్రయోగాలకు సంబంధించిన వీడియోను మనీష్ ప్రసాద్ అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ ప్రయోగాల్లో ఆర్మీ అధికారులు కూడా పాల్గొన్నారని డీఆర్‌డీవో పేర్కొంది.

Also Read:

Xerox copies of Rs.2000: నకిలీ రూ. 2 వేల నోట్లు ఏటీఎంలో జమ; జిరాక్స్‌ తీసి తన భార్య ఖాతాతో డిపాజిట్

IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!

Covid 19: పరిశోధకులు చెబుతున్న “బయో వార్” ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎలా అంతమవుతుంది..?