IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!

ఇకనుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!
Irctc Ticket Booking
Follow us
Venkata Chari

|

Updated on: Jun 26, 2021 | 8:57 AM

IRCTC Ticket Booking: ఇకనుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బ్లాక్ టికెట్లను నిరోధించడంతోపాటు ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కృషి చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వెబ్‌సైట్‌లోనూ భారీగా మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకనుంచి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్‌ లేదా పాస్‌పోర్ట్‌ నంబర్‌తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల టికెట్ బుకింగ్‌ల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అందుకే ఆధార్, పాస్‌పోర్ట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

“టికెట్ బుకింగ్ కోసం లాగిన్ కావాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు వంటి పత్రాలు తప్పనిసరి చేసేందుకు ఐఆర్‌సీటీసీతో కలిసి మేము పని చేస్తున్నాం. ఆధార్ కార్డును చేర్చే ప్రక్రియ చివరి దశలో ఉందని” రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ అన్నారు. “ట్రైన్‌ టిక్కెట్లు వేగంగా బుక్‌ చేసేందుకు ఏజెంట్లు ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సాధారణ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా సమయం(కనీసం 10 నుంచి 15 నిమిషాలు) పడుతుందని కొన్ని సోర్సులు వెల్లడిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతూ తప్పుడు పేర్లతో టికెట్లు బుక్ చేసుకుని, ప్రీమియం రేట్లకు అమ్ముకుంటున్నారని” ఆయన వెల్లడించారు.

ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లే. త్వరగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేలా ఆర్‌ఫీఎఫ్ కృషి చేస్తోంది. పాస్‌పోర్టులను కూడా లింక్ చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ నిర్ణయం రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొటున్నాయి. అప్పుడు టికెట్ బుక్ చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు నంబర్లను వెబ్‌సైట్ గుర్తిస్తుంది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టినట్లేనని అధికారులు భావిస్తున్నారు.

ఇలా అక్రమాలకు పాల్పడే వారికి శిక్షలను కూడా పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఫీఎఫ్ 2018 నుంచి ఈ ఏడాది మే వరకు దాదాపు 14,250 మందిని అరెస్టు చేసింది. కఠిన నియమాలు అమలుచేసి, వారికి బెయిల్‌ కూడా దొరకకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి ఆర్‌ఫీఎఫ్ ఇదే పనిలో నిమగ్నమై ఉంది. అక్రమ సాఫ్ట్‌వేర్ వినియోగాలపై ఓకన్నేసింది. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకుని, అక్రమ సాఫ్ట్‌వేర్‌లను స్టడీ చేస్తోంది. అలాగే 2018 నుంచి 2021 మే మధ్య సుమారు రూ .28.34 కోట్ల విలువచేసే టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

IRCTC Special Tour: 15 రోజుల టూర్‌కు రూ.13 వేలే ఖర్చు… ఆగస్టు 24 నుంచి భారత్ దర్శన్ స్పెషల్‌ ట్రైన్‌!

AP Tourism : ఏపీలో టూరిజం ప్లేసెస్ ను ఓపెన్ చేసిన ప్రభుత్వం.. పర్యాటకులను ఆకర్షించేలా మార్కెటింగ్ చేస్తమంటున్న మంత్రి

Chatur Das Ji Temple: ఏడు రోజులు ఏడు ప్రదక్షిణలు చేసి.. హారతి ఇస్తే.. పక్షవాతం తగ్గించే మహిమాన్విత దేవాలయం ఎక్కడో తెలుసా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!