Bank Alert: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఐదు రోజులు ఆ సర్వీసులు బంద్.. వెల్లడించిన బ్యాంక్..
బ్యాంక్ కస్టమర్లకు కొన్ని విషయాలను తప్పుకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకులు
బ్యాంక్ కస్టమర్లకు కొన్ని విషయాలను తప్పుకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా.. కొత్త సర్వీసులు.. నిబంధననలకు సంబంధించిన అప్ డేట్స్ తెలియజేస్తున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లను హెచ్చరించింది. క్రెడిట్ కార్డుపై ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదని బ్యాంక్ కస్టమర్లకు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను తన కస్టమర్లకు ఎస్ఎంఎస్ లు పంపింది.
క్రెడిట్ కార్డుపై ట్రాన్సాక్షన్ కంట్రోల్ పెసిలిటీ జూన్ 30 వరకు అందుబాటులో ఉండదని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మెయింటెనెన్స్ వర్క్ కారణంగా ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని క్లారిటీ ఇచ్చింది బ్యాంక్. ఈ మేరకు క్రెడిట్ కార్డు వాడే కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. కస్టమర్లకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఫీచర్ వలన కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై నియంత్రణ ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది. అదేవిధంగా మేనేజ్ కార్డ్ ఆప్షన్ ద్వారా మీ కార్డు కంట్రో ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 3 రకాల ఆప్షన్లు ఉంటాయి. అందులో ఏటీఎం విత్ డ్రాయెల్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేవి కనిపిస్తాయి. కస్టమర్లు వీటిని ఎనెబుల్ లేదా డెసెబుల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డిసెబుల్ చేస్తే మీ కార్డును లావాదేవిలకు ఉపయోగించలేరని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఏపీ: ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. ఈ నెల 30 నుంచి దరఖాస్తు స్వీకరణ..
Shocking Video: ఒక్క సెకన్ అటు ఇటు అయినా చిరుతకు ఆహారం అయ్యేవాడే!.. షాకింగ్ వీడియో మీకోసం..