- Telugu News Photo Gallery Science photos Know about golden blood group which is very rare in the world all about golden blood
Golden Blood Group: మీకు బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసు.. అత్యంత అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నారా? ఇక్కడ తెలుసుకోండి!
Golden Blood Group: ప్రపంచంలో అందరికీ తెలిసిన అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. కానీ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ మాత్రం గోల్డెన్ గ్రూప్. ఈ గోల్డెన్ బ్లడ్ గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 26, 2021 | 1:18 PM

ఎవరైనా మిమ్మల్ని అరుదైన బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగితే వెంటనే.. 'బాంబే బ్లడ్' గ్రూప్ అని చెప్పేస్తారు. దాదాపుగా అందరికీ తెల్సిన విషయం ఇది. కానీ, దానికంటే అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. అదే 'గోల్డెన్ బ్లడ్' గ్రూప్. మనకు బాగా తెలిసిన బ్లడ్ గ్రూప్ లు ఏ, బీ, ఏబీ, ఓ మాత్రమే. ఈ అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్ నల్(Rh null).

రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. 'ఏ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు. అలాగే, ఎర్ర రక్త కణాలు 61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. అసలు Rh అనేదే లేకపోతే.. అదే గోల్డెన్ గ్రూప్ (Rh null). ఈ అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు.

వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్ ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. వంశపారంపర్యంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ గ్రూప్ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. వీరికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

ఈ రక్తం కలిగిన వారిని కూడా విశ్వదాతలు అంటారు. వాళ్లు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. అంతేకాదు, ప్రాణాలను కాపాడటంలో ఇతర గ్రూపుల రక్తంతో పోల్చితే Rh null ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. కానీ, అది దొరకడం అంత సులువైన పనికాదు. అందుకే, దాన్ని 'గోల్డెన్ బ్లడ్' అంటారు" అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



