Shocking Video: ఒక్క సెకన్ అటు ఇటు అయినా చిరుతకు ఆహారం అయ్యేవాడే!.. షాకింగ్ వీడియో మీకోసం..

Shocking Video: జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ క్షణంలోనైనా ఏదైనా జరుగొచ్చు. ముఖ్యంగా జనన మరణాలు..

Shocking Video: ఒక్క సెకన్ అటు ఇటు అయినా చిరుతకు ఆహారం అయ్యేవాడే!.. షాకింగ్ వీడియో మీకోసం..
Cheetah
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 1:03 PM

Shocking Video: జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ క్షణంలోనైనా ఏదైనా జరుగొచ్చు. ముఖ్యంగా జనన మరణాలు దేవుని చేతుల్లో ఉంటాయని పెద్దలు అంటుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు తమ పాటికి తాము రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తుంటే అకస్మాత్తుగా వాహనమో, మరేదో వచ్చి ఢీకొట్టిన ఘటనలు కోకొల్లలు చూశాడు. ఊహించని రీతిలో ప్రమాదాలు వచ్చిపడుతుంటాయి. మరికొన్నిసార్లు క్షణకాలంలో ప్రమాదాల నుంచి బయటపడి ఎంతోమంది తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అలాంటి ఘటనలు కూడా చాలానే చూశాం. అయితే, తాజాగా షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి క్షణకాలంలో చిరుత నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకున్నాడు. ఏమాత్రం పట్టుతప్పినా.. ఆ చిరుతకు ఆహారంగా మారిపోయవాడు అని చెప్పాలి. ఒళ్ల గగుర్పొడిచే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. సుశాంత్ నంద షేర్ చేసిన ఈ వీడియో స్లో మోషన్‌లో ఉంది. ఒక వ్యక్తి బాత్రూమ్‌ నుంచి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తాడు. ఆ క్రమంలో ఇంట్లోని వస్తువులను ఢీకొని పట్టుతప్పి కిందపడిపోతాడు. అయినప్పటికీ క్షణాల్లోనే మళ్లీ పైకి లేకి బయటకు పరుగులు తీస్తాడు. అతను బయటకు పరుగులు తీస్తుండగానే ఊహించని రీతిలో అతని వెంట భారీ చిరుతపులి దూకుతుంది. క్షణాల్లో అతను లేచి పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా అక్కడ అతను చిరుత పులికి బలి అయ్యేవాడని ఆ వీడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది.

ఈ స్లోమోషన్ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోయారు. ఈ వీడియో చూడటానికి భయానకంగా ఉంది. ఒక్క సెకనులో జీవితమే తారుమారు అయ్యేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాగా, షాకింగ్ వీడియోను ఇప్పటి వరకు 30 వేల మందికిపైగా వీక్షించారు. 2వేల మంది రీట్వీట్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Mumbai: దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలుడు.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ…

Third Front: బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రతిపక్షాల వ్యూహం.. కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యమని తేల్చిన శరద్ పవార్!

ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.