Mumbai: దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలుడు.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ…

Mumbai: పాపం ఓ బాలుడు దొంగతనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. అతని సహచర దొంగ బాలుడి మృతదేహాన్ని ఘటనాస్థలంలోనే..

Mumbai: దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలుడు.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ...
Boy Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 12:40 PM

Mumbai: పాపం ఓ బాలుడు దొంగతనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. అతని సహచర దొంగ బాలుడి మృతదేహాన్ని ఘటనాస్థలంలోనే వదిలి పారిపోయాడు. పైగా.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అసలు విషయాన్ని గ్రహించి ఫోన్ చేసిన చెప్పిన సహచర దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఏంటి సంగతి అని అతన్ని పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా.. మ్యాటర్ మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేశాడు. అతని చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

16 ఏళ్ల బాలుడు, షాబాజ్ ఖాన్(21) ఇద్దరూ దొంగతనాలు చేస్తుండే వారు. ఈ క్రమంలోనే వాషినాకాలోని ఎంహెచ్ఏడీఏ కాలనీలో జనసంచారం పెద్దగా లేని ఇంటిని టార్గెట్‌గా చేసుకుని దొంగతనానికి ప్రణాళికలు వేశారు. అయితే, దోపిడీ చేయాల్సిన ఇంట్లోకి వెళ్లంటే.. మరో బిల్డింగ్ నుంచి వెళ్లా్ల్సి ఉంటుంది. దాంతో వారు వెదురు కర్రపై నడుచుకుంటూ ఒక బిల్డింగ్ లోంచి మరో బిల్డింగ్‌లోకి వెళ్లాలని ప్లా్న్ చేసుకున్నారు. అయితే, 16 ఏళ్ల బాలుడు బరువు తక్కువగా ఉండటంతో.. నువ్వైతేనే కరెక్ట్, బరువు తక్కువగా ఉండటం వల్ల కర్రపై నడుచుకుంటూ వెళ్లొచ్చంటూ షాబాజ్ ఖాన్ అతన్ని ఒప్పించాడు. అలా ఆ బాలుడు కర్ర సాయంతో అవతలి బిల్డింగ్‌లోకి ప్రవేశించి మూడు సెల్‌ఫోన్లను దొంగిలించాడు. అనంతరం తిరిగి వస్తుండగా.. మధ్యలో వెదరు కర్ర విరిగిపోయింది. దాంతో ఆ బాలుడు ఐదవ అంతస్థు నుంచి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

వెంటనే అలర్ట్ అయిన షాబాజ్ ఖాన్.. గాయపడిన బాలుడిని తోపుడు బండిపై వేసి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే చనిపోవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తరువాత, పోలీసులకు ఫోన్ చేసి పలానా ప్రాంతంలో బాలుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. దొంగతనం సందర్భంగా ఈ ఘటన జరిగిందని గుర్తించిన పోలీసులు.. తమకు సమాచారం ఇచ్చిన షాబాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, చనిపోయిన బాలుడు సహా షాబాజ్ ఖాన్‌ దొంగతనాలకు అలవాటు పడ్డారని, వీరిపై ఇంతకుముందే అనేక కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

Also read:

Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. స్థానికుల నమూనాలు సేకరిస్తున్న అధికారులు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!