Narcotics : పారిశ్రామికవాడలో 91.5 కిలోల మత్తు పదార్థాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Jun 26, 2021 | 12:05 PM

కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని కోలార్ పారిశ్రామికవాడలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. కోలార్ లో ట్రక్కులో తరలిస్తున్న 91.5 కిలోల అల్ప్రజోలం ను నార్కోటిక్..

Narcotics : పారిశ్రామికవాడలో 91.5 కిలోల మత్తు పదార్థాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
Factory

Kolar Industrial area Bidar : కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని కోలార్ పారిశ్రామికవాడలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. కోలార్ లో ట్రక్కులో తరలిస్తున్న 91.5 కిలోల అల్ప్రజోలం ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది.

Cash

Cash

అయితే, డ్రగ్స్ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోనూ సంబంధాలున్న ఎన్.వి.రెడ్డి అనే వ్యాపార వేత్త నివాసంలోనూ బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎన్.వి.రెడ్డి ఇంట్లో రూ.62 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకూ ఐదుగురిని అరెస్టు చేసినట్లు బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు.

Drugs

Drugs

జయ గ్రాండ్ హోటల్‌పై పోలీసులు దాడి.. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్

గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ గ్రాండ్ హోటల్ మీద పోలీసులు ఆకస్మికంగా దాడిచేశారు. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. హోటల్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించనట్టు తెలుస్తోంది. అయితే, నిందితులు మాత్రం తాము ఏ తప్పూ చేయలేదని తమను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోతున్నట్టు సమాచారం.

Read also : Tragedy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో శవాలుగా మారిన నలుగురు కుటుంబ సభ్యులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu