CM KCR Review: ప‌ల్లె ప్రగ‌తిలో నిర్ధేశించిన పని పెండింగ్‌లో పెట్టకూడదు.. సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్రగ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు.

CM KCR Review: ప‌ల్లె ప్రగ‌తిలో నిర్ధేశించిన పని పెండింగ్‌లో పెట్టకూడదు.. సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Cm Kcr Samiksha
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 3:03 PM

CM KCR Palle Pragathi Review:  ప‌ల్లె, పట్టణ ప్రగ‌తి కార్యక్రమంలో నిర్ధేశించిన ఏ పనిని పెండింగ్‌లో పెట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్రగ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జులై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగ‌తి, ప‌ట్టణ ప్రగ‌తి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

అభివృద్ధికి సంబంధించిన ఏ ప‌నీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్రభుత్వం బాగా స‌హ‌క‌రిస్తోంది. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అభివృద్ధిలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలన్నారు. అలాగే, ప్రతి ఏటా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు సీఎం. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలన్నారు. ఎన్నడూ లేని విధంగా పంట‌ల‌తో రాష్ర్టం ధాన్యాగారంగా మారింది. ఈ క్రమంలో రాష్ర్టానికి అద‌న‌పు రైస్ మిల్లులు అవ‌స‌రం ఉంద‌న్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు.

ఈ స‌మీక్షా స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్‌లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.

Read Also… Zomato: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జొమాటో.. భారీ ఎత్తున మ‌హిళ‌ల‌ను తీసుకోనున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌.. 

సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా