Telangana Congress: రాజకీయ దుమారం రేపుతున్న సీఎం కేసీఆర్‌తో సీఎల్పీ నేతల భేటీ.. భట్టి బృందంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎల్పీ నేతలు భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతోంది. కేసీఆర్‌తో భేటీ అవ్వడంపై వివరణ ఇవ్వాలని భట్టిని పార్టీ అధిష్టానం ఆదేశించిందట.
Congress High Command Serious on CLP Leaders: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎల్పీ నేతలు భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతోంది. ఓవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ భేటీ పార్టీకి నష్టం కలగిస్తుందని కొందరు నేతలు మండిపడుతున్నారు. మరోవైపు, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అవ్వడంపై వివరణ ఇవ్వాలని భట్టిని పార్టీ అధిష్టానం ఆదేశించిందట.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఏప్పుడూ , ప్రత్యర్దుల ఊహాకు చాలా దూరంగా ఉంటాయి.. ఎప్పుడు.. ఎందుకు.. ఏ నిర్ణయం తీసుకుంటారో ఏవరికీ అర్దం కాదు. ముఖ్యంగా రాజకీయంగా కొట్టే దెబ్బ సుతిమెత్తగా ఉంటుంది . ఇప్పడు కాంగ్రెస్ నేతలకు అలాంటి దెబ్బే తగిలినట్టుంది. కేసిఆర్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి పోయింది. సొంత పార్టీ నేతలను ఏమీ అనలేక.. బయటకు మాట్లాడలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారట కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సైతం ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటిది శుక్రవారం మొదటిసారి వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. అయితే, ఇటీవల యాదాద్రి జిల్లా అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురై మరియమ్మ అంశం గురించి మాట్లాడేందుకు మాత్రమే సీఏంను కలిసామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే, రాజకీయంగా పార్టీకి నష్టం జరిగిందని మిగతా నేతలు పార్టీలో అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు హుజూరాబాద్ ఎన్నిక జరుగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో భేటీ అవ్వడం వల్ల తప్పుడు సంకేతాలు జనాలలోకి వెళ్లాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం సీఎల్పీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్‌కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే చర్చ మొదలయింది. ఇటు, సొంతపార్టీనేతలు సైతం భట్టి బృందంపై విరుచుకుపడుతోంది. కావాలనే పార్టీని నష్టపరిచేందుకు సీఏంను కలిసారని రేవంత్ రెడ్డి అండ్ టీం నేతలు చెపుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డికి పీసీసీ ఖరారు అయిందనే వార్తల నేపథ్యంలో భట్టి అండ్ టీం కేసిఆర్‌ను కలవడం మరో చర్చకు దారితీస్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసిఆర్ ను కలవడం పట్ల పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. విత్ ఇన్ దా పార్టీలో చర్చించకుండా ముఖ్యమంత్రిని కలవడం ఏంటన్నదీ పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. సీఎంతో భేటి అవ్వడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ భట్టిని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, హైకమాండ్ కు భట్టి ఏటువంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.