Balka Suman : ఈటల లేఖ నకిలీదని బండి సంజయ్.. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయాలి : బాల్కా సుమన్

తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ - బీజేపీ నేతల కామెంట్ల వ్యవహారం మరో స్టేజ్ కు చేరింది. ఈటెల రాజేందర్.. సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ వైరల్..

Balka Suman : ఈటల లేఖ నకిలీదని బండి సంజయ్.. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయాలి : బాల్కా సుమన్
MLA Balka Suman
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 26, 2021 | 2:36 PM

Balka Suman Challenge to Bandi Sanjay : తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ – బీజేపీ నేతల కామెంట్ల వ్యవహారం మరో స్టేజ్ కు చేరింది. ఈటెల రాజేందర్.. సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ వైరల్ అవుతుందని సుమన్ చెప్పుకొచ్చారు. అయితే, “ఆ లేఖ ఫేక్ అని బీజేపీ నేతలు అంటున్నారు.. ఇది నకిలీ లేఖ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయాలి” అని సుమన్ సవాల్ విసిరారు. దమ్ముంటే, ఇది ఫేక్ నకిలి లేఖ అని నిరూపించాలి. తన సవాల్ ను సంజయ్ కుమార్ స్వీకరించాలి అని సుమన్ డిమాండ్ చేశారు.

ఇలా ఉండగా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS B-team గా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారన్న ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాటలు నిజమయ్యాయన్నారు. ఓట్ల‌ బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ లో ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖలు రాస్తున్నారని రఘునందన్ రావు తెలిపారు.

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ స్వయంగా ఒప్పుకున్నాడని రఘునందన్ రావు అన్నారు. కొడుకు లాంటి ఈటల పట్ల సీఎం పవర్తించిన తీరు ఎలా ఉందో బాల్కా సుమనే చెప్పాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే హుజురాబాద్ లో పునరావృతం అవుతుందని తేల్చి చెప్పారు రఘునందన్ రావు. బాల్కా సుమన్ కాదు..కేసీఆర్ కుటుంబానికి బానిస సుమన్ అని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.

కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదన్న విషయం బాల్కా సుమన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో సుష్మా స్వరాజ్ వెనుక చేతులు కట్టుకుని కేసీఆర్ తిరిగిన విషయం విజయశాంతికి మాత్రమే తెలుసునన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నించారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులే అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవు కాబట్టి.. ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదని..మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు విమర్శించారు.

రోజా ఇంట్లో భోజనం చేసినప్పుడు రాక్షసులని కేసీఆర్ కు తెలియదా? ప్రగతి భవన్లో అలయ్ బలయ్ ఇచ్చినప్పుడు రాక్షసులని మంత్రి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు తెలియదా? ఎన్నికను బట్టి సీమాంధ్రులపై టీఆర్ఎస్ విమర్శలు మారుతుంటాయన్నారు రఘునందన్ రావు.

Read also : SI sexual Harassment : మైనర్ బాలికపై SI లైంగిక వేధింపులు.. తండ్రిని, అన్నని చంపేస్తానంటూ గన్ తో బెదిరింపులు

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..