Minister Puvvada Ajay: ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా.. బీజేపీ తీరును తూర్పారబట్టిన మంత్రి పువ్వాడ..
Minister Puvvada Ajay: కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సహా బీజేపీ వైఖరిపై తెలంగాణ..
Minister Puvvada Ajay: కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సహా బీజేపీ వైఖరిపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మలిదశ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ పోరాటం చేశారని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమంగా నీళ్ల తరలింపు కార్యక్రమం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. కేంద్రానికి అబద్ధాలు చెబుతూ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారంటూ ఏపీ సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. ఇక ప్రాజెక్టుల విషయంలో బీజేపీ వైఖరి మరీ విచిత్రంగా ఉందని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన నేతలు ఏపీలో ఒకలా మాట్లాడితే.. తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారంటూ వారి విధానానలు తూర్పారబట్టారు. కేంద్రంలో అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోందని ధ్వజమెత్తారు.
నీటి పంపకాల సమయంలో కేసీఆర్ లేడని, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడే తెలంగాణ లో ఒకలా.. ఏపీలో మరోలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల ప్రజల భాగోగుకోసం కేసీఆర్ రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని వ్యాఖ్యానించారని, ఆ మాటలను ఏపీ ప్రభుత్వ పెద్దలు వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బచావత్ ట్రిబ్యునల్‌లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు ఇంకా తేలలేదన్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా లాక్కున్న 7 మండలాలలో పోలవరం కట్టి ఒక్క ఏకరానికి కూడా నీళ్లు ఇవ్వడం లేదన్నారు. వైఎస్‌ఆర్ విషయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వందశాతం నిజం అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే తాము పోరాడుతామని, తమ హీరోయిజం కోసం కాదని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
Also read:
Heath Tips: సరైన నిద్ర లేకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువే.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు…