Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Tourism : ఏపీలో టూరిజం ప్లేసెస్ ను ఓపెన్ చేసిన ప్రభుత్వం.. పర్యాటకులను ఆకర్షించేలా మార్కెటింగ్ చేస్తమంటున్న మంత్రి

AP Tourism : దేశంలో కారోనా తగ్గిందని లాక్ డౌన్ ఎత్తేసిన వేళ.. నేను ఉన్నానంటూ.. మళ్ళీ సెకండ్ వేవ్ వణికించింది. దీంతో అనేక రాష్ట్రాలు తమ ప్రాంతాలకు రావద్దు అంటూ.. సరిహద్దులకు తాళం వేసుకున్నారు..

AP Tourism : ఏపీలో టూరిజం ప్లేసెస్ ను ఓపెన్ చేసిన ప్రభుత్వం.. పర్యాటకులను ఆకర్షించేలా మార్కెటింగ్ చేస్తమంటున్న మంత్రి
Ap Tourism
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2021 | 6:29 PM

AP Tourism : దేశంలో కారోనా తగ్గిందని లాక్ డౌన్ ఎత్తేసిన వేళ.. నేను ఉన్నానంటూ.. మళ్ళీ సెకండ్ వేవ్ వణికించింది. దీంతో అనేక రాష్ట్రాలు తమ ప్రాంతాలకు రావద్దు అంటూ.. సరిహద్దులకు తాళం వేసుకున్నారు . దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఈ కరోనా వైరస్ వలన సామాన్యులతో పాటు అనేక పరిశ్రమలు ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగ సంస్థపై విపరీతమైన ప్రభావం చూపించింది కరోనా.. అయితే సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మళ్ళీ పర్యాటక రంగానికి అనుమతులు లభిస్తున్నాయి. ఆ దిశగా పలు రాష్ట్రాలు అనుమతులను ఇస్తూ.. కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రాంతాల సందర్శనకు పర్యాటకులకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పర్యాటక ప్రాంతాల గురించి దేశ వ్యాప్తంగా రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు. ఏపీని పర్యాటక రంగంలో అభివృద్ధి చేసే దిశగా మార్కెటింగ్ చేస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల వివరాలు

ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖ పట్నంలోని పలు ప్రాంతాలు పర్యాటకులను ఆకర్శితాయి. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ లో బ్లూ బే హోటల్ ని 165కోట్ల రూపాయలతో నిర్మించారు. డాల్ఫిన్ నోస్ కి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం విశాఖపట్నంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతంగా ఉంది.

కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామీ కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి. శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

విజయవాడకి 6కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గుహలు చాలా పురాతనమైనవి. 20 అడుగుల ఏకశిలపై అనంత పద్మనాభస్వామి విగ్రహంతో పాటు.. అలనాటి శిల్పకళా చాతుర్యంతో పాటు పురావస్తు వస్తువుల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శిచవచ్చు.

కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఇంద్రకీలాద్రి గుట్టపై వెలసిన దుర్గమ్మ రాష్ట్రావ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది.

వీటితో పాటు కేరళ అందాలను తలపించే కోనసీమ దిండి.. సముద్రం గోదావరి వారి కలిసే ప్రాంతం అంతర్వేది.. వంటి అనేక పుణ్యక్షేత్రాలు, బీచ్ లు పర్యటనలకు వీలుగా ఉన్నాయి.

Also Read: మనపూర్వీకులు పెట్టిన సంప్రదాయంలో పరమార్ధం ఉందా.. పట్టీతో మహిళలకు ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా