వీళ్లు మామూలు నేరస్తులు కాదుగా.. పోలీస్ స్టేషన్‌నే క్రైంస్టేషన్గా మార్చేసిన ముఠా..
సైబర్ నేరగాళ్లపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సైబర్ బారిన పడిన బాధితుల సంఖ్య అంతకింతకు పెరుగుతుంది. వివిధ మార్గాల్లో అమాయక ప్రజల నుండి లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఒక సర్కులర్ జారీ చేసింది. ప్రభుత్వ అధికారుల పేర్లులతో సిబిఐ, ఆర్బీఐ, ఎన్సీబీ అధికారుల లాగా నటిస్తున్న సైబర్ నేరగాలను పట్టుకునే పనిలో ఉంది. ప్రతిరోజు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు వేల సంఖ్యలో కాల్స్ వస్తూనే ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సైబర్ బారిన పడిన బాధితుల సంఖ్య అంతకింతకు పెరుగుతుంది. వివిధ మార్గాల్లో అమాయక ప్రజల నుండి లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఒక సర్కులర్ జారీ చేసింది. ప్రభుత్వ అధికారుల పేర్లులతో సిబిఐ, ఆర్బీఐ, ఎన్సీబీ అధికారుల లాగా నటిస్తున్న సైబర్ నేరగాలను పట్టుకునే పనిలో ఉంది. ప్రతిరోజు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు వేల సంఖ్యలో కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎక్స్ట్రాక్షన్ తో పాటు బ్లాక్మెయిలింగ్, డిజిటల్ అరెస్ట్ అంటూ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పార్సెల్ పేరుతో జరుగుతున్న సైబర్ మాఫియా ఆగడాలు శృతినించిపోయాయి.
పార్సిల్స్‌లో నకిలీ పాస్ పోర్ట్‌లతో పాటు మత్తు పదార్థాలు ఉన్నాయని అమాయకులను నమ్మించి వారికి ఆన్లైన్లో స్కైప్ ద్వారా వీడియో కాల్ చేసి ఫేక్ స్టూడియోలో ఒక మోడల్ పోలీస్ స్టేషన్లో తయారుచేసి బాధితులను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుండి లక్షలు కాజేస్తున్నారు. కేవలం డబ్బు కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కాలర్ ట్యూన్‌ను రూపొందించింది. కొన్ని సందర్భాల్లో డిజిటల్ అరెస్టు రూపంలో బాధితులను నమ్మించి వారి డిమాండ్లు నెరవేరే వరకు నిజమైన పోలీస్ అధికారుల లాగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు చేస్తున్న స్కైప్ వీడియో కాల్ ద్వారా వారు నిజమైన పోలీసులు ఏమో అనుకున్న బాధితులు కూడా వారి ట్రాప్‌లో పడుతున్నారు. ఈ నేరగాళ్లు స్టూడియోను వాడుకొని మోడల్ పోలీస్ స్టేషన్లను క్రియేట్ చేసి ప్రభుత్వ అధికారులుగా నమ్మించే విధంగా వారి దుస్తులను ధరిస్తున్నారు. వీరి బారిన పడిన బాధితులు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు.
ఇప్పటికే వీరి వద్దనుండి కోట్ల రూపాయల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. కేంద్ర హోం శాఖ ప్రకటన ప్రకారం ఈ చర్యలకు పాల్పడుతుంది క్రాస్ బార్డర్‌కి చెందిన క్రైమ్ నేరస్తులుగా అనుమానిస్తున్నారు. వీరి చర్యలపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అన్ని రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈ చర్యలకు పాల్పడుతున్న 1000 మంది స్కైప్ ఐడీలను బ్లాక్ చేసినట్లు హోం శాఖ ప్రకటించింది. దీంతోపాటు మీరు ఉపయోగిస్తున్న సెల్ఫోన్లను సిమ్ కార్డులను సైతం బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వీరి బారిన పడకుండా ఉండేందుకు ఇన్ఫో గ్రాఫిక్స్‌తో పాటు సోషల్ మీడియా సైబర్ దోస్త్ ద్వారా అనేక అవగాహన వీడియోలను సైతం పోస్ట్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. బాధితులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని.. ఇలాంటి కాల్స్ వచ్చినా వెంటనే 1930 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..