AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. డ్రైవర్ పరార్

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవర్‌టెక్‌, మద్యం తాగి నడపడం, అతి వేగం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో అమాయకులు బలవుతున్నారు. కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. తాజాగా గురువారం మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. డ్రైవర్ పరార్
Road Accident
Subhash Goud
|

Updated on: May 16, 2024 | 6:39 AM

Share

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవర్‌టెక్‌, మద్యం తాగి నడపడం, అతి వేగం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో అమాయకులు బలవుతున్నారు. కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. తాజాగా గురువారం మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి గుర్తుతెలియని వాహనం, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిలౌడ్ సమీపంలో జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపారు.

ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారీ అయితే ప్రమాదం తర్వాత డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడని, అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు

ప్రమాదానికి సంబంధించి సమీపంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన వివరాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వాంగ్మూలం వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టమవుతుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!