Bharat Jodo Yatra: ఏపీలో రాహుల్ గాంధీ ఒకరోజు పాదయాత్ర.. ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి..

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో..

Bharat Jodo Yatra: ఏపీలో రాహుల్ గాంధీ ఒకరోజు పాదయాత్ర.. ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి..
Congress Bharat Jodo Yatra
Follow us

|

Updated on: Oct 14, 2022 | 2:22 PM

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తై ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఉన్నట్లుండి కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యారు. వాస్తవానికి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంటరై.. కొంత ప్రాంతంలో పాదయాత్ర చేసి ఆ తర్వాత తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర వెళ్లేలా ప్లాన్ చేశారు. కర్ణాటకలో యాత్ర పూర్తైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. కానీ అక్టోబర్ 14వ తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కేవలం ఒక రోజు మాత్రమే ఆయన ఈ యాత్ర చేయనున్నారు. అది కూడా 12 కిలోమీటర్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఏరియాలు తమిళనాడు, కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉంటాయి. దీంతో కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బళ్లారి ప్రాంతానికి చేరుకుని.. పాదయాత్ర చేస్తున్నారు. అనంతపురం అనంతపురం జిల్లా డి.హీరోహల్ మండలం జాగర గల్ వద్ద ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. డి.హీరోహల్, ఓబులాపురం గ్రామం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఏపీలో పాదయాత్ర ముగించుకుని మళ్లీ కర్ణాటకలో సాగుతుంది.

శుక్రవారం మొత్తం 12 కిలోమీటర్ల మేర ఏపీలో పాదయాత్ర సాగుతుంది. ఈరోజు రాత్రికి బళ్లారిలో బస అనంతరం మోకా నుంచి రేపు కర్ణాటకలో పాదయాత్ర సాగుతుంది. ఈ నెల 17వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌ లోకి ప్రవేశిస్తుంది.

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో  పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీతో నడుస్తున్నారు. కాగా.. ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఈరోజు భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీతో పాటు నడిచారు.

ఇవి కూడా చదవండి

ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన సందర్భంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతలపై ఆయన ఫైర్ అయినట్లు సమాచారం. పార్టీ అగ్రనేత పాదయాత్ర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు సరిగ్గా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..