Viral: నగరంలో నయా మోసం.. నగ్నంగా కనిపించే కళ్ల జోళ్లు అంటూ రూ. లక్షలు దోచేశారు

సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం భౌతికంగా దాడులు చేసి దోచుకునే రోజులు పోయాయి మోసం చేసి డబ్బులు కాజేసే కేటుగేళ్లు చెలరేగి పోతున్నారు. ప్రజల అత్యాశనే పెట్టుబడిగా చేసుకుంటూ లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చింది...

Viral: నగరంలో నయా మోసం.. నగ్నంగా కనిపించే కళ్ల జోళ్లు అంటూ రూ. లక్షలు దోచేశారు
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2023 | 9:04 AM

సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం భౌతికంగా దాడులు చేసి దోచుకునే రోజులు పోయాయి మోసం చేసి డబ్బులు కాజేసే కేటుగేళ్లు చెలరేగి పోతున్నారు. ప్రజల అత్యాశనే పెట్టుబడిగా చేసుకుంటూ లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని కోయంబేడులో జరిగిన ఈ సంఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల సమాచారం ప్రకారం.. కొయంబేడులో నలుగురు యువకులు ఒక ముఠాలో ఏర్పడి యువతను టార్గెట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నగ్నంగా కనిపించే కూలింగ్ గ్లాస్‌ల పేరుతో భారీగా దోచుకున్నారు. ఈ గ్లాసెస్‌ పెట్టుకుంటే ఎదుటి వ్యక్తులు నగ్నంగా కనిపిస్తారని నమ్మించి ఒక్కో గ్లాస్‌ను రూ. లక్షల్లో అమ్మేశారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతను టార్గెట్ చేసుకొని ఈ మోసానికి పాల్పడ్డారు. కోయంబేడులో అనుమానస్పదంగా కనిపించిన ఓ కేరళ ముఠాకు చెందిన నలుగుర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పట్టుబడ్డ వారు బెంగళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైట్, జిత్తు, ఇర్షాద్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో పాటు కూలింగ్ గ్లాసెస్‌, తపపాకీ, బుల్లెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..