AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murty: నారాయణ మూర్తితో మొదటి పరిచయం ఎలా జరిగిందో చెప్పేసిన సుధామూర్తి

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా ముర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రచయితగా, ఫిలాంత్రపిస్ట్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోని సంస్థ వారు నిర్వహిస్తున్న 'ది కపిల్ షర్మ షో' కి వచ్చారు. ఆమెతో పాటు నటి రవీనా టండన్, నిర్మాత గునిత్ మోంగా కూడా వచ్చారు.

Aravind B
|

Updated on: May 09, 2023 | 9:12 AM

Share

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రచయితగా, ఫిలాంత్రపిస్ట్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోని సంస్థ వారు నిర్వహిస్తున్న ‘ది కపిల్ షర్మ షో’ కి వచ్చారు. ఆమెతో పాటు నటి రవీనా టండన్, నిర్మాత గునిత్ మోంగా కూడా వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియోను నిర్వహకులు విడుదల చేశారు. అందులో సుధాముర్తి.. తన భర్త నారయణ మూర్తిని మొదటిసారి ఎలా కలిసాననే విషయాన్ని చెప్పుకొచ్చింది. తనకు ప్రసన్న అనే ఓ స్నేహితురాలు ఉండేదని.. ఆమె నారయణ మూర్తి అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని ప్రతిరోజు తనకోసం తీసుకొచ్చేదని తెలిపింది. ఈ నారాయణ మూర్తి అంతర్జాతీయ బస్ కండక్టరా అని అనుకునేదాన్ని అంటూ నవ్వులు పూయించింది. అయితే అతడ్ని తన స్నేహితురాలే మొదటిసారిగా పరిచయం చేసిందనట్లు తెలిపింది. అయితే నారాయణ మూర్తిని కలవక ముందు అతను చూడడానికి సినిమా హిరోలాగా.. హాండ్‌సమ్‌గా ఉంటాడని అనుకున్నానని చెప్పింది. కాని అతను డోర్ తీసి మమ్మల్ని చూడగానే.. ఎవరూ ఈ చిన్నపిల్లాడు అని అనుకున్నట్లు చెప్పి అందరిని నవ్వించింది.

అలాగే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా వాళ్లు తమ దాంపత్య జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. వాళ్లిద్దరూ కూడా ఒకరినొకరు తమ అభిరుచికి గౌరవం ఇచ్చుకుంటామని.. కుటుంబం, పిల్లలను జాగ్రత్తగా చూసుకునేవాళ్లమని సుధామూర్తి చెప్పింది. తాను మునుపటి కంటే ఎక్కువ పని చేస్తున్నానని.. దీనికి నారాయణ మూర్తి ఎప్పుడు అభ్యంతరం తెలపలేదని పేర్కొంది. అలాగే తాము ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటామని కాని ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోమంటూ తెలిపింది. అలాగే తాము ఒకరి మెయిల్స్ మరొకరు కూడా చూసుకునే వాళ్లం కాదని.. 1978 నుంచి ఇదే పాటిస్తున్నామని నారాయణ మూర్తి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..