Heavy rainfall: తమిళనాడులో దంచికొడుతున్న వానలు.. నీటమునిగిన చెన్నై నగరం..
తమిళనాడును వదలడం లేదు వరుణుడు. వారం రోజులుగా రాష్ట్రంపై పంజా విసిరాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి.

Tamil Nadu Rains: తమిళనాడును వదలడం లేదు వరుణుడు. వారం రోజులుగా రాష్ట్రంపై పంజా విసిరాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి. రాత్రి నుంచి చెన్నై మహానగరంలో జోరువానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కోయంబత్తూర్ జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి.
శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని పెరింగల్‌పీటులో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా నిలిచింది. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయు తుఫాను విస్తరించి ఉందని పేర్కొంది.
ఇది నవంబర్ 9 నుండి 12 వరకు తమిళనాడు తీరం వెంబడి భారీ వర్షాలు, ఈదురు గాలులకు వీస్తాయని హెచ్చరించింది.
#ChennaiRains #Chennai Still Cyclones are yet to come ! pic.twitter.com/Ohm9GW7OS8
— tc (@iamthirlok) November 7, 2021
ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..
విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా
