Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగని..

శ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..  తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగని..
Representative Image
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 07, 2021 | 8:32 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రో మంట తగ్గడం పెరుగుతోంది. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే..కేంద్రం తగ్గించినా.. తెలుగురాష్ట్రాలు ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పడుతున్నాయి విపక్షాలు.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.91 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.34గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.15 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.25లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.89గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.23గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.33గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.15 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.23లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.56 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..

విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా