Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..
ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-ఖాదిమీ నివాసంపై ఆదివారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. AFP ప్రకారం, ప్రధాని కడిమి సురక్షితంగా ఉన్నారు. ప్రధానిపై హత్యాయత్నం విఫలమైంది.
Baghdad Attack: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-ఖాదిమీ నివాసంపై ఆదివారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. AFP ప్రకారం, ప్రధాని కడిమి సురక్షితంగా ఉన్నారు. ప్రధానిపై హత్యాయత్నం విఫలమైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్-ఖాదిమీ నివాసంపై బాగ్దాద్‌లో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. మొత్తం ఈ ఘటనలో ఐదుగురికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో ప్రధాని ముస్తఫా అల్-ఖాదిమీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన ర్యాలీలో బాంబు పేలుడు సంభవించిందని ఇరాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానిని హత్య చేసేందుకు ఇరాక్ సైన్యం విఫల ప్రయత్నమని పేర్కొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దాడికి తామే అంటూ ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు.
ఇదిలావుంటే ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాన్‌తో జతకట్టిన భారీ సాయుధ సమూహాలు దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాయని అక్కడి అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తమ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారని వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:Donkey Fair: ఈ ఏడాది గాడిదల జాతరకు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన వ్యాపారులు..
Liquor Store Tenders: మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్ విడుదల.. తేదీల వివరాలు ఇవే..