Human Tail: అప్పుడే పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. 12 సెం.మీ తోకతో బాలుడి జననం.. ఎక్కడంటే..?
Boy with a Tail: బ్రెజిల్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఓ శిశువును చూసి వైద్యులంతా ఆశ్చర్యపోయారు. శిశువు తోకతో
Boy with a Tail: బ్రెజిల్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఓ శిశువును చూసి వైద్యులంతా ఆశ్చర్యపోయారు. శిశువు తోకతో జన్మించడంతో వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలోని ఫోర్టలెజా పట్టణంలో చోటుచేసుకుంది. ఫోర్టలెజా పట్టణానికి చెందిన మహిళ పురిటినొప్పులతో ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. అయితే.. సాధారణ కాన్పునకు అవకాశం లేకపోవడంతో వైద్యులు.. ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే.. పుట్టిన మగ శిశువుకు తోక ఉండటాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ తోక 12 సెంటీమీటర్ల పొడవుంది. తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే.. గతంలో గర్భిణికి అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు నిర్వహించినప్పటికీ.. ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు వెల్లడించారు. దీనిని నిజమైన మానవ తోకగా వైద్యులు పేర్కొంటున్నారు. అయితే.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని వైద్యులు స్పష్టంచేశారు. కేవలం చర్మానికి మాత్రమే తోక పెరిగిందని వెల్లడించారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు పేర్కొన్నారు. అయితే.. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ చూడలేదంటూ వైద్యులు తెలిపారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: