PM Modi: ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్.. తాజా సర్వేలో ఆ వివరాలు..
PM Modi: ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోడీ ముందు వరుసలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్..
PM Modi: ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోడీ ముందు వరుసలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో మిగతా దేశాల నేతలు ఉన్నారు. ఈ విషయాన్ని.. కేంద్రమంత్రి పియూష్ గోయాల్ ‘కూ’ యాప్‌లో వెల్లడించారు.
ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచారని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది. ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే ప్రధాని మోడీ ముందున్నట్లు సర్వేలో తేలింది.
సర్వేలో వెల్లడైన నేతల పేర్లు:
1. నరేంద్ర మోదీ: 70 శాతం 2. లోప్ ఒబ్రాడర్: 66 శాతం 3. మారియో డ్రాగి: 58 శాతం 4. ఏంజెలా మెర్కెల్: 54 శాతం 5. స్కాట్ మోరిసన్: 47 శాతం 6. జస్టిన్ ట్రూడో: 45 శాతం 7. జో బిడెన్: 44 శాతం 8. ఫ్యూమియో కిషిడా: 42 శాతం 9. మూన్ జే-ఇన్: 41 శాతం 10. బోరిస్ జాన్సన్: 40 శాతం 11. పెడ్రో శాంచెజ్: 37 శాతం 12. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: 36 శాతం 13. జైర్ బోల్సోనారో: 35 శాతం
కాగా, ప్రతి దేశంలోని కొంతమంది ఇంటర్వ్యూల ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ఈ జాబితాను తయారు చేస్తుంది. మార్నింగ్ కన్సల్ట్ ఇండియాలో 2,126 మందిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాలలోని అగ్ర నాయకులకు రేటింగ్ ఇచ్చింది.
Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxodoxB
Modi: 70% López Obrador: 66% Draghi: 58% Merkel: 54% Morrison: 47% Biden: 44% Trudeau: 43% Kishida: 42% Moon: 41% Johnson: 40% Sánchez: 37% Macron: 36% Bolsonaro: 35%
*Updated 11/4/21 pic.twitter.com/zqOTc7m1xQ
— Morning Consult (@MorningConsult) November 6, 2021
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉండటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. కష్టపడి పని చేసే తత్వం, నిజాయితీగల నాయకుడిగా గుర్తింపు ప్రజల్లో ఆయన ఇమేజ్‌ను మరింత పెంచిందని అన్నారు. ఆయన పనితనమే ప్రజాధరణ పొందేలా చేసిందని కొనియాడారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ట్వీట్ చేశారు.
प्रधानमंत्री श्री @narendramodi एक सर्वे में 70 फ़ीसदी अप्रूवल रेटिंग के साथ, दुनिया के सबसे लोकप्रिय राजनेता के रूप उभर कर सामने आए हैं। जनसामान्य में उनके नेतृत्व के प्रति विश्वास और एक कर्मठ और ईमानदार नेता के रूप में उनकी छवि उन्हें सबसे विश्वसनीय और लोकप्रिय बनाती है।
— Rajnath Singh (@rajnathsingh) November 7, 2021