AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం కీలక నిర్ణయం.. వికసిత భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధికి ముందడుగు..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వికసిత భారత్..2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం..అభివృద్ధి అంటే ప్రతి రంగంలోనూ ముందండటం..అందులో కీలకమైన దేశ అంతర్గత భద్రతపై దృష్టి సారించింది కేంద్రం..ఇందుకోసం దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం పై పోలీస్ ఉన్నతాధికారుల వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్రం.

కేంద్రం కీలక నిర్ణయం.. వికసిత భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధికి ముందడుగు..
Pm Modi
Gopikrishna Meka
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 27, 2025 | 1:56 PM

Share

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వికసిత భారత్..2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం..అభివృద్ధి అంటే ప్రతి రంగంలోనూ ముందండటం..అందులో కీలకమైన దేశ అంతర్గత భద్రతపై దృష్టి సారించింది కేంద్రం..ఇందుకోసం దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం పై పోలీస్ ఉన్నతాధికారుల వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్రం. నవంబర్ 28- 30 మూడు రోజులపాటు రాయ్ పూర్ లో 60వ అఖిల భారత డీజీపీ-ఐజీపీల అత్యున్నత భద్రతా అధికారుల సమావేశాలు వేదిక కానున్నాయి. ఐఐఎం నయా రాయ్‌పూర్ క్యాంపస్‌లో జరగనున్న సమావేశాలలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివిధ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొంటారు. వికసిత భారత్ – భద్రతా ప్రమాణాలు థీమ్ తో జరగనున్న అఖిల భారత డీజీపీ-ఐజీపీ సమావేశాల్లో పోలీసింగ్ సవాళ్లను పరిష్కరించడంలో సాధించిన పురోగతి పై సమీక్ష జరగనుంది..సురక్షిత భారత్ నిర్మాణం కోసం భవిష్యత్తు లక్ష్యాలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద నిరోధం, విపత్తు నిర్వహణ, మహిళల భద్రత, పోలీసింగ్‌లో ఫోరెన్సిక్ సైన్స్, AI వాడకం పై చర్చలు జరగనున్నాయి

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగే 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్/ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ..నవంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు జరిగే సమావేశంలో ఇప్పటివరకు ఎదురవుతున్న కీలకమైన పోలీసింగ్ సవాళ్లను పరిష్కరించడంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు.. వికసిత భారత్ జాతీయ దృక్పథానికి అనుగుణంగా సురక్షిత భారత్ ను నిర్మించడానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి..వికసిత భారత్ – భద్రతా ప్రమాణాలు అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగే ఈ సమావేశంలో, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద నిరోధం, విపత్తు నిర్వహణ, మహిళల భద్రత, పోలీసింగ్‌లో ఫోరెన్సిక్ సైన్స్, కృత్రిమ మేధస్సు వాడకం వంటి కీలక భద్రతా అంశాలపై వివరణాత్మక చర్చలు విధినిర్వహణలో విశిష్ట సేవలందించిన పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రధానమంత్రి అందజేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ పోలీసు అధికారులు.. భద్రతా నిర్వాహకులు విస్తృత శ్రేణి జాతీయ భద్రతా సమస్యలపై బహిరంగ, అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడానికి ఈ సమావేశం ఒక కీలకమైన ఇంటరాక్టివ్ వేదికను అందిస్తుంది. నేరాలను పరిష్కరించడంలో, శాంతిభద్రతలను కాపాడుకోవడంలో, అంతర్గత భద్రతా ముప్పులకు ప్రతిస్పందించడంలో వృత్తిపరమైన పద్ధతులను రూపొందించడం, పరస్పర సహకారం అందించుకోవడంతో పాటు, పోలీసు దళాలు ఎదుర్కొంటున్న సమస్యలు,కార్యాచరణ, మౌలిక సదుపాయాలు సంక్షేమ సంబంధిత సవాళ్ల పై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి.

దేశ అంతర్గత భద్రతను ముమ్మరం చేస్తున్న కేంద్రం

2014 నుండి, ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం యొక్క ఫార్మాట్ నిరంతరం అప్‌గ్రేడ్ చేయబడుతుంది.., అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో అఖిల భారత డీజీపీ-ఐజీపీల వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతను ముమ్మరం చేస్తున్నాయి…గతంలో గౌహతి (అస్సాం), రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), టెకన్‌పూర్ (గ్వాలియర్, మధ్యప్రదేశ్), స్టాట్యూ ఆఫ్ యూనిటీ (కెవాడియా, గుజరాత్), పూణే (మహారాష్ట్ర), లక్నో (ఉత్తరప్రదేశ్), న్యూఢిల్లీ, జైపూర్ (రాజస్థాన్) , భువనేశ్వర్ (ఒడిశా)లలో డిజిపి, ఐజిపి సమావేశాలు జరిగాయి… ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం 60వ DGsP/IGsP సమావేశం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరగనుంది

అంతర్గత భద్రత పై నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వార్షిక సమావేశాల్లో నిరంతరం ఆసక్తి కనబరుస్తూ, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహిస్తూ, పోలీసింగ్ పై కొత్త ఆలోచనలు వెలువడే వాతావరణాన్ని పెంపొందిస్తున్నారు… అంతర్గత భద్రత విధాన విషయాలపై ప్రధానమంత్రితో కొందరు పోలీసులు నేరుగా తమ దృక్పథాలను,అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది..మూడు రోజులపాటు జరిగే సమావేశంలో కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, సహాయ మంత్రులు (హోం వ్యవహారాలు), రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు సంస్థల అధిపతులు పాల్గొంటారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల హోం శాఖ అధిపతులు , DIG, SP హోదాల్లోని కొంతమంది ఎంపిక చేసిన అత్యాధునిక స్థాయి పోలీసు అధికారులు కూడా ఈ సంవత్సరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు