అయ్యో దేవుడా.. ఆ తల్లి బాధ ఎవరు తీర్చగలరు.. కళ్ల ముందే కొడుకు..
ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలో 5వ తరగతి విద్యార్థి చౌహాన్ యాదవ్ మరణం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా మానసిక బాధతో ఉన్న బాలుడు సడెన్‌గా చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అది ఆత్మహత్య.. లేక హత్య..? అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలోని అమ్లిపాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరిపాత్ర గ్రామంలో హృదయ విదారక సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న చౌహాన్ యాదవ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో మొత్తం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడు చౌహాన్ యాదవ్ తన ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఉదయం పొలాలకు వెళ్తున్న గొర్రెల కాపరులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి, వెంటనే కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దకు సమాచారం అందించారు.ఇంత చిన్న వయస్సులో బాలుడు ఈ కఠినమైన చర్య ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు, కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు.
కుటుంబం తెలిపిన వివరాల ప్రకారంచచ గత వారం రోజులుగా చౌహాన్ మానసికంగా బాధపడుతున్నాడు. వారు పదేపదే ప్రయత్నించినా తన బాధ గురించి చెప్పకుండా చౌహాన్ మౌనంగా ఉండిపోయాడు. చివరి వరకు తనను ఈ స్థితికి దారి తీసిన అసలు కారణం ఏమిటో వారికి తెలియలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపారు.
మరణానికి గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నామని అమ్లిపాడ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు.ప్రారంభంలో ఈ కేసు ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది.
