మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

మహారాష్ట్రలో సెలబ్రిటీల ' హంగామా ' ! ' పొలిటికల్ లీడర్లలో జోష్ !

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, నేటికీ బ్యూటీగా వెలుగొందుతున్న మాధురీ దీక్షిత్, మరో బ్యూటీ, నటి కూడా అయిన పద్మినీ కొల్హాపురి, ఇంకొక నటి దియా మీర్జా తమ ఓట్లు వేశారు. ముంబై.. పశ్చిమ బాంద్రా లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఆమిర్ ఖాన్.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. […]

Pardhasaradhi Peri

| Edited By:

Oct 21, 2019 | 2:11 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, నేటికీ బ్యూటీగా వెలుగొందుతున్న మాధురీ దీక్షిత్, మరో బ్యూటీ, నటి కూడా అయిన పద్మినీ కొల్హాపురి, ఇంకొక నటి దియా మీర్జా తమ ఓట్లు వేశారు. ముంబై.. పశ్చిమ బాంద్రా లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఆమిర్ ఖాన్.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. తన భార్య కిరణ్ రావు తో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి తన భార్య లారా దత్తాతో కలిసి ఓటు వేశారు. పద్మినీ కొల్హాపురి పశ్చిమ అంధేరీలో, దియా మీర్జా ముంబైలో, సినీ నటుడు, గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ గోరె గావ్ లో ఓట్లు వేశారు. లాతూర్ లోని పోలింగ్ కేంద్రంలో రితేష్ దేశ్ ముఖ్, ఆయన సతీమణి జెనీలియా డిసౌజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రితేష్ సోదరులు అమిత్, ధీరజ్… లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

ఇక రాజకీయ నాయకుల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన భార్య అమృతతో కలిసి నాగపూర్ లో ఓటు వేశారు. ఎన్సీపీ సీనియర్ నేత సుప్రియా సోలె.. పూణే జిల్లాలోని బారామతిలో, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్ జిల్లాలో తమ ఓట్లు వేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో తిరిగి కాషాయ జెండాను ఎగురవేయడానికి బీజేపీ తహతహలాడుతోంది. మరి-శివసేన-బీజేపీ పొత్తు ఎంతవరకు లాభిస్తుందో చూడాలి..

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:08PM” class=”svt-cd-green” ] 12 గంటల వరకు హర్యానాలో 23 శాతం పోలింగ్ నమోదు [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:07PM” class=”svt-cd-green” ] 12 గంటల వరకు మహారాష్ట్రలో 14 శాతం పోలింగ్ నమోదు [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:07PM” class=”svt-cd-green” ] బరిలో 3,237 మంది అభ్యర్థులు [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:07PM” class=”svt-cd-green” ] మహారాష్ట్ర వ్యాప్తంగా 96,661 పోలింగ్ కేంద్రాలు [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:07PM” class=”svt-cd-green” ] ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:06PM” class=”svt-cd-green” ] రెండు రాష్ట్రాలతో పాటు 51 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఎన్నికలు [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం” date=”21/10/2019,2:06PM” class=”svt-cd-green” ] ఓటు హక్కు వినియోగించుకున్న మోహన్ భగవత్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అమీర్ ఖాన్, శరద్ పవార్, అజిత్ పవార్ [/svt-event]

[svt-event title=”పోలింగ్ సమరం ” date=”21/10/2019,2:02PM” class=”svt-cd-green” ] మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ [/svt-event]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu