వేలిపై ఇంక్ గుర్తుతో టిక్ టాక్ స్టార్ .. అందరి కళ్ళూ ఆమె పైనే !

హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్.. సోమవారం హిసార్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలిపైని ఇంక్ గుర్తును ఆమె మీడియాకు చూపారు. తన టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సోనాలీ.. నా గెలుపు ఖాయం అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆదంపూర్ లో ఈమె సీనియర్ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ని […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:48 am, Mon, 21 October 19
వేలిపై ఇంక్ గుర్తుతో టిక్ టాక్ స్టార్ .. అందరి కళ్ళూ ఆమె పైనే !

హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్.. సోమవారం హిసార్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలిపైని ఇంక్ గుర్తును ఆమె మీడియాకు చూపారు. తన టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సోనాలీ.. నా గెలుపు ఖాయం అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆదంపూర్ లో ఈమె సీనియర్ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ని ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బిష్ణోయ్ మూడు సార్లు గెలుపొందడం విశేషం. (దివంగత మాజీ సీఎం భజన లాల్ కుమారుడే ఈయన). హర్యానాలో 90 సీట్లకు పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలవరకు కొనసాగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఐ ఎన్ ఎల్ డీ, సహా ఇటీవలే ఏర్పాటైన జననాయక్ జనతా పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1169 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 24 న తేలనుంది. హర్యానాలో మళ్ళీ తమ విజయం ఖాయమని కమలనాథులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధానంగా స్థానిక అంశాల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ఏకరువు పెట్టారు. ఇక మోదీ.. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఆ పార్టీ వల్ల దేశం గతంలో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ.. బీజేపీకే ఓటు వేస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు.