యూపీలో ఇక కాషాయ జెండా ? ఎస్పీ, బీఎస్పీ ఆశలు గల్లంతు ?

ఉత్తరప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. చూడబోతే ఇది బీజేపీకే కలిసొచ్ఛే కాలం లా కనిపిస్తోంది. కారణం ? కాంగ్రెస్ మాట అటుంచి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గానీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గానీ ఈ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనకపోవడమే.. సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు గతంలో మాదిరి పొత్తు పెట్టుకుకోండా వేటికవే ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఇవి అన్ని.. 11 సీట్లకూ తమ అభ్యర్థులను […]

యూపీలో ఇక కాషాయ జెండా ? ఎస్పీ, బీఎస్పీ ఆశలు గల్లంతు ?
Follow us

|

Updated on: Oct 21, 2019 | 11:15 AM

ఉత్తరప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. చూడబోతే ఇది బీజేపీకే కలిసొచ్ఛే కాలం లా కనిపిస్తోంది. కారణం ? కాంగ్రెస్ మాట అటుంచి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గానీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గానీ ఈ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనకపోవడమే.. సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు గతంలో మాదిరి పొత్తు పెట్టుకుకోండా వేటికవే ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఇవి అన్ని.. 11 సీట్లకూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. అఖిలేష్ యాదవ్ ఒక్క రామ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాత్రమే పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఈ పార్టీ నేత తాజీజాన్ ఫాతిమా తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆమె భర్త ఆజం ఖాన్ లోక్ సభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి కనీసం ఒక్క ఎన్నికల సభలోనూ పాల్గొనకపోవడం ఆశ్ఛర్యకరం. ఉపఎన్నికల ప్రచారంపట్ల తమ నాయకురాలికి నమ్మకం లేదని ఆమె సొంత పార్టీవారే ప్రకటించడం విడ్డూరం. అలాగే 11 సీట్లకూ పోటీ చేస్తున్న కాంగ్రెస్ తన ప్రచారాన్ని మొక్కుబడిగా చేసింది. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంలో యూపీని తమ అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రంగా భావించి.. ప్రత్యేకంగా ప్రియాంక గాంధీ ని కూడా ప్రచార బరిలోకి దింపిన ఈ పార్టీ ఈ ఉపఎన్నికల్లో ఆశలు వదలుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఎస్పీ, బీఎస్పీ ధోరణి కూడా ఉంది. ఇక బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్య నాథ్ .. అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్ రద్దు వంటి జాతీయ అంశాలను ఆయన ప్రముఖంగా తన ప్రచార ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా.. యూపీలో సోమవారం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఈ ఉపఎన్నికలను ఒక్క కమలం పార్టీ మాత్రమే ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఓటర్లలో కమలనాథుల హడావుడే కనిపించింది.