AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేనాధిపతి ఎక్కడ.? బీజేపీతో పొత్తే కారణమా?

మహారాష్ట్రలో కింగ్ మేకర్‌గా పాపులరైన శివసేన రూట్ మారిందా.? శివసేన.. 53 ఏళ్ళ క్రితం బాల్ థాక్రే ఈ పార్టీని ముంబైలో ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా.. కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి మంచి పట్టు సాధించింది ఈ పార్టీ. థాక్రే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా.. పార్టీ తరపున అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెడుతూ.. రాజకీయ చక్రం తిప్పారు. అయితే బీజేపీతో 25 ఏళ్ళ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుని 2014 […]

సేనాధిపతి ఎక్కడ.? బీజేపీతో పొత్తే కారణమా?
Ravi Kiran
|

Updated on: Oct 21, 2019 | 1:23 PM

Share

మహారాష్ట్రలో కింగ్ మేకర్‌గా పాపులరైన శివసేన రూట్ మారిందా.? శివసేన.. 53 ఏళ్ళ క్రితం బాల్ థాక్రే ఈ పార్టీని ముంబైలో ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా.. కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి మంచి పట్టు సాధించింది ఈ పార్టీ. థాక్రే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా.. పార్టీ తరపున అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెడుతూ.. రాజకీయ చక్రం తిప్పారు. అయితే బీజేపీతో 25 ఏళ్ళ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో  శివసేనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో.. ఆ కుటుంబం నుంచి ఎన్నికల్లో మొదటిసారిగా ఆదిత్య థాక్రేను వర్లీ స్థానం నుంచి రంగంలోకి దింపింది.

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా శివసేన పక్కా ప్రణాళికలతో మేనిఫెస్టోను రూపొందించారు. పబ్లిసిటీ రీత్యా టీవీలు, పత్రికల్లో విపరీతంగా ఎడ్వార్టైస్మెంట్‌స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా తమ పార్టీ సొంత పత్రికైన ‘సామ్నా’లో కూడా విస్తృత ప్రచారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. మొదటిసారి శివసేన తమ పార్టీ వ్యవస్థాపకుడైన బాలాసాహెబ్ థాక్రే ఫోటోను ముద్రించకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఈ విషయంలో శివ సైనికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ఫొటోలో సాహెబ్ లేరు. అసలు ఇది ఎలా జరిగింది? పార్టీ ఆయన్ని ఎలా మర్చిపోతుందని? ట్విట్టర్ వేదికగా ఓ శివసేన ఫాలోవర్ ప్రశ్నించగా.. ‘పార్టీని స్థాపించింది ఆయన.. హిందుత్వం గురించి ఆయన చెప్పిన బోధనల ద్వారానే మేము పార్టీలో చేరాం’ అని మరొకరు కామెంట్ చేశారు.

పత్రికలో ప్రచురితమైన పూర్తి యాడ్‌లో ఉద్దవ్ థాక్రే, ఆదిత్య థాక్రే ఫోటోలు తప్ప.. ఎక్కడా కూడా వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఫోటో అనేది కనిపించదు. ఈ యాడ్‌ను చూసిన శివ సైనికులందరూ అసహనం వ్యక్తం చేసి.. ఆదివారం సేన భవన్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో పత్రికలో ప్రచురితమైన తప్పును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే శివసేన మహారాష్ట్రలోని 124 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆదిత్య థాక్రే వర్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అంతేకాక ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని.. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.