కాపీ వివాదం.. సినిమా ప్రమోషన్‌లో భాగమేనా.?

కాపీ వివాదం.. సినిమా ప్రమోషన్‌లో భాగమేనా.?

సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకనిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల పరంగా పలు సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏదైనా చిత్రం విడుదలకు ముందు కాపీ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాపీ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. రీసెంట్‌గా దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ మూవీ కాపీ ఇష్యూ‌లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన చిన్న కుమార్ అనే రచయిత […]

Ravi Kiran

|

Oct 21, 2019 | 7:36 PM

సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకనిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల పరంగా పలు సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏదైనా చిత్రం విడుదలకు ముందు కాపీ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాపీ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. రీసెంట్‌గా దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ మూవీ కాపీ ఇష్యూ‌లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

తెలంగాణకు చెందిన చిన్న కుమార్ అనే రచయిత కమ్ దర్శకుడు.. తన కథలోని మెయిన్ పాయింట్‌ను తీసుకుని ‘బిగిల్’ కథా, కథనాన్ని డెవలప్ చేశారని.. తెలంగాణ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఒక్క చిత్రమే కాపీ వివాదంలో చిక్కుకోలేదు. గతంలో కూడా అనేక సినిమాలు కాపీ ఇష్యూని ఫేస్ చేశాయి. ఇక ఇందులో విజయ్ చిత్రాలు అధికంగా ఉండటం గమనార్హం. ‘బిగిల్’తో పాటుగా ‘సర్కార్’, ‘మెర్సల్’ చిత్రాలు కూడా ఈ కాంట్రవర్సరీలో చిక్కుకున్నాయి.

ఇటు టాలీవుడ్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్, సమంతా జంటగా వచ్చిన ‘జబర్దస్త్’పైన యష్ రాజ్ ఫిలిమ్స్ కాపీ రైట్స్ కేసు వేసింది. దీనికి సంబంధించిన తుది తీర్పు కూడా ఇటీవలే వెల్లడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబు ‘శ్రీమంతుడు’.. ఎన్టీఆర్ ‘టెంపర్’కి కూడా ఇలాంటి ప్రాబ్లెమ్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కథ తనదేనంటూ హీరో ఆకాష్ ఎంత గొడవ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వివాదాలు అయితే వచ్చాయి గానీ.. అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే.. సినిమా విడుదల వరకు ఈ వివాదాలపై ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఎందుకని స్పందించట్లేదని. అందుకే నెటిజన్లు ఈ ఉదంతాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది కూడా సినిమా ప్రమోషన్‌లో ఒక భాగమేనని.. ఫ్యాన్స్‌ను థియేటర్ల వరకు తీసుకురావడానికి ఇదొక ట్రిక్ అని అంటున్నారు. ఇక మరికొందరేమో ఇది నిజమని నమ్మినా.. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ మూవీ అయినా హిట్ కొడుతుందని వాదిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu