AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trains Cancelled: బిపర్‌జాయ్‌ ఎఫెక్ట్.. 67 రైళ్లు రద్దు.. ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధింపు

బిపర్‌జాయ్ తుఫాను శరవేగంతో దూసుకువస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్‌ వద్ద తీరం దాటనుంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా..

Trains Cancelled: బిపర్‌జాయ్‌ ఎఫెక్ట్.. 67 రైళ్లు రద్దు.. ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధింపు
Trains Cancelled
Srilakshmi C
|

Updated on: Jun 13, 2023 | 9:59 AM

Share

బిపర్‌జాయ్ తుఫాను శరవేగంతో దూసుకువస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్‌ వద్ద తీరం దాటనుంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే మంగళవారం 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. రద్దైన రైళ్లలో ముంబైకి చెందినవి 5 ఉన్నాయి. జూన్ 14న బయల్దేరవల్సిన రైలు నెం. 22903 బాంద్రా టెర్మినస్-భుజ్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జూన్ 16న రైలు నెం. 09415 బాంద్రా టెర్మినస్ – గాంధీధామ్ స్పెషల్ ట్రైన్లు కూడా రద్దయ్యాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పలు భద్రత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దైన ట్రైన్లకు సంబంధించిన టికెట్ల రిఫండ్‌ త్వరలో ప్రయాణికుల ఖాతాల్లో జమకానుంది.

భవ్‌నగర్ డివిజన్‌లో 5, రాజ్‌కోట్‌లోని 8, అహ్మదాబాద్ డివిజన్‌లోని 3 ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూఆర్‌లోని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 50 కి.మీ కంటే అధికంగా గాలులు వీస్తే వెంటనే రైళ్లను ఆపివేయాలని స్టేషన్ మాస్టర్‌లకు సూచించారు. ట్రాక్, వంతెనలపై ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రైలు కార్యకలాపాలకు ఏదైనా ఆటంకం కలిగితే తక్షణ చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూమ్‌కి సూచించారు. వైర్‌లెస్ కమ్యూనికేషన్, 15 వీహెచ్‌ఎఫ్ సెట్లు, శాటిలైట్ ఫోన్‌లు తదితర సౌకర్యాలతో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.

రాబోయే తుఫాను ముప్పును విజయ వంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమ రైల్వే ముమ్మర ఏర్పాట్లు చేస్తోది. ఈ క్రమంలో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 15 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే తీరప్రాంతాల్లో హెచ్చరికలు పంపారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను సైతం రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..