Stray Dogs: దారుణ ఘటన.. వీధి కుక్కల దాడిలో 11 ఏళ్ల మూగ బాలుడు మృతి

వీధికుక్కల దాడిలో11 ఏళ్ల మూగ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కేరళలో ఆదివారం జూన్‌ (11) చోటుచేసుకుంది. కన్నూర్‌లోని ముజాపిలంగాడ్ కిటినకం మసీదు సమీపంలో నిహాల్ నౌషాద్ (11) ఆటిజంతో బాధపడుతున్నాడు. దీంతో పుట్టినప్పటి నుంచి..

Stray Dogs: దారుణ ఘటన.. వీధి కుక్కల దాడిలో 11 ఏళ్ల మూగ బాలుడు మృతి
Stray Dogs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2023 | 6:17 PM

తిరువనంతపురం: వీధికుక్కల దాడిలో11 ఏళ్ల మూగ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కేరళలో ఆదివారం జూన్‌ (11) చోటుచేసుకుంది. కన్నూర్‌లోని ముజాపిలంగాడ్ కిటినకం మసీదు సమీపంలో నిహాల్ నౌషాద్ (11) ఆటిజంతో బాధపడుతున్నాడు. దీంతో పుట్టినప్పటి నుంచి నిహాల్‌కు మాటలు రావు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకుపోయాయి.

చీకటిపడినా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల గాలించినా కనిపించకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఇంటికి అర కిలోమీటరు దూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఒంటి నిండా తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. గాయాలతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలుడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా కేరళలో పిల్లలు కుక్కల దాడిలో చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 13న 12 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు కిరాతకంగా దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజే అదే గ్రామంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిపై వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. కుక్కల దాడులు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరిగాయి. వీటిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. వీధికుక్కలను చంపడం ద్వారా సమస్యకు పరిష్కారం కాదని, శాస్త్రీయమైన పరిష్కారం కనుగొనాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..