UPSC Prelims Results 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2023 ఫలితాలు విడుదల.. సెప్టెంబరు 15 నుంచి మెయిన్స్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 ఫలితాలు సోమవారం (జూన్ 12) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. దాదాపు 14,624 మంది పరీక్షలో అర్హత..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 ఫలితాలు సోమవారం (జూన్ 12) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. దాదాపు 14,624 మంది పరీక్షలో అర్హత సాధించారు. గత నెల మే 28న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్ పరీక్షలకు హాజరుకావడానికి తప్పనిసరిగా డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్-1 (DAF-1) పూరించవల్సి ఉంటుందని కమిషన్ సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఈ సందర్భంగా యూపీఎస్సీ ప్రకటించింది. సెప్టెంబరు 15 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
కాగా ప్రతీయేట ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో యూపీఎస్సీ నియామకాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 1105 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ.. ఈ మూడు దశల్లో నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించి సందేహాలున్నవారు అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు 011-23385271, 011-23098543, 011-23381125 పోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృతి చేసుకోవచ్చని యూపీఎస్సీ పేర్కొంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2023 ఫలితాల పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.