AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aurangzeb: వాట్సప్‌ ఫ్రొఫైల్‌ పిక్‌గా ఔరంగజేబు ఫొటో.. వ్యక్తిపై కేసు, అరెస్ట్‌

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అదివారం (జూన్‌ 11) అరెస్ట్‌ చేశారు. ముంబైకి చెందిన వషి అనే వ్యక్తి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో..

Aurangzeb: వాట్సప్‌ ఫ్రొఫైల్‌ పిక్‌గా ఔరంగజేబు ఫొటో.. వ్యక్తిపై కేసు, అరెస్ట్‌
Aurangzeb
Srilakshmi C
|

Updated on: Jun 12, 2023 | 4:45 PM

Share

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అదివారం (జూన్‌ 11) అరెస్ట్‌ చేశారు. ముంబైకి చెందిన వషి అనే వ్యక్తి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా వషి తన వాట్సప్‌ ప్రొఫైల్ పిక్‌గా ఔరంగజేబ్ చిత్రాన్ని పెట్టుకోవడంపై అమర్జీత్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోలీసులకు సమర్పించాడు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 298, 153 ఎ కింద ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లను కీర్తించడంపై మహారాష్ట్రలోని పలు నగరాల్లో గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చెలరేగుతున్నాయి. టిప్పుసుల్తాన్‌ కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు, అభ్యంతరకరమైన ఆడియో సందేశానికి వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాత్మక నిరసనలకు దారితీసింది. కొల్హాపూర్ అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై నిరసనకారులు గత బుధవారం (జూన్ 7న) రాళ్లు రువ్వారు.

అంతకుముందు అహ్మద్‌నగర్‌లో ఊరేగింపులో ఔరంగజేబు ఫోటోలను ప్రదర్శించారు. అలాగే సంగమ్‌నేర్ నగరంలో కూడా మతపరమైన ఊరేగింపు సందర్భంగా అభ్యంతరకరమైన నినాదాలతో ఔరంగజేబు పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో హిందూ సమాజ్ ర్యాలీలో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని సహించబోమని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.