నా భార్యను అర్ధనగ్నంగా చేసి 120 మంది దాడి చేశారు.. ఆర్మీ జవాన్ ఆవేదన

దేశానికి రక్షణగా ఉండే సైనికులకు దేశ ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ తన భార్యను అర్ధనగ్నంగా చేసి కొందరు దుండగులు దాడి చేశారంటూ ఓ వీడియోలో చెప్పడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని పాడవేడు గ్రామానికి చెందిన ప్రభాకరణ్ అనే వ్యక్తి ఆర్మీలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు.

నా భార్యను అర్ధనగ్నంగా చేసి 120 మంది దాడి చేశారు.. ఆర్మీ జవాన్ ఆవేదన
Army Jawan
Follow us
Aravind B

|

Updated on: Jun 12, 2023 | 4:17 PM

దేశానికి రక్షణగా ఉండే సైనికులకు దేశ ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ తన భార్యను అర్ధనగ్నంగా చేసి కొందరు దుండగులు దాడి చేశారంటూ ఓ వీడియోలో చెప్పడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని పాడవేడు గ్రామానికి చెందిన ప్రభాకరణ్ అనే వ్యక్తి ఆర్మీలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కశ్మీర్‌లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్యపై దాడి జరిగిందని చెప్పిన వీడియోను రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన లెఫ్టినెట్ కల్నవ్ ఎన్. త్యాగరాజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ప్రభాకరన్ మాట్లాడుతూ.. లీజుకు తీసుకున్న ఓ ప్రాంతంలో తన భార్య దుకాణాన్ని నడుపుతోందని చెప్పాడు. ఆమెను దాదాపు 120 మంది దుండగులు ఆమెను అర్థనగ్నంగా చేసి మూక దాడి చేశారని.. దుకాణంలోని వస్తువులు బయట పడేశారని తెలిపాడు. తమ కుటుంబ సభ్యులను కూడా కత్తులతో బెదిరించారని చెప్పాడు. ఈ ఘటనపై ఎస్పీకి పిటీషన్ పంపానని.. ఆయన చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారని.. డీజీపీ సర్ సహాయం చేయండి అంటూ అభ్యర్థించాడు.

అయితే ఈ వ్యవహారంపై కందవాసల్ పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ప్రభాకరణ్ పెద్దది చేసి చెబుతున్నారని ఆరోపించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. రేనుగంబాల్ అనే గుడికి చెందిన స్థలంలో ఆ దుకాణాన్ని ఏర్పాటు చేశారని.. ప్రభాకరణ్ మామ అయిన సెల్వామూర్తికి కుమార్ అనే అతను దాన్ని రూ.9.5 లక్షల కోసం ఐదేళ్ల పాటు లీజుకు ఇచ్చారని తెలిపారు. కుమార్ చనిపోయిన తర్వాత అతని కొడుకు రాము ఆ దుకాణాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నాడని… ఇందుకోసం డబ్బులు తిరిగిస్తానని ఒప్పుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించి సెల్వామూర్తితో ఒప్పందం కూడా చేసుకున్నాడని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత సెల్వామూర్తి డబ్బులు తీసుకొనేందుకు అంగీకరించలేదని.. ఆ దుకాణాన్ని వదిలేందుకు నిరాకరించాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో జూన్‌ 10వ తేదిన రాము ఆ దుకాణం వద్దకు వెళ్లి సెల్వమూర్తి కుమారులకు డబ్బులు తిరిగి ఇచ్చేశాడని తెలిపారు. కానీ వారు రాముపై కత్తితో దాడి చేసినట్లు తెలియడంతో.. చుట్టపక్కల వారు రాముకు మద్దతుగా వచ్చి ఆ షాపుపై దాడి చేశారని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభాకరన్‌ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని కానీ వారిపై దాడి జరగలేదని చెప్పారు. అదే రోజు సాయంత్రం కీర్తి ఆసుపత్రిలో చేరింగని.. ప్రభాకరన్‌ ఆమెపై దాడి జరిగిందని చెబుతున్నాడని అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరు పక్షాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె.అన్నామలై ఆర్మీ జవాన్‌ కుటుంబానికి మద్దతు ప్రకటించారు. దాడికి గురైన ఆర్మీ జవాను భార్యకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం