ఫ్యాషన్ షోలో విషాదం.. ర్యాంప్ వాక్‌లో ఐరన్ ఫిల్లర్ పడి మోడల్ మృతి..
దురదృష్టవశాత్తు ర్యాంప్ వాక్ చేస్తుండగా లైటింగ్ ఏర్పాటు చేసిన ఐరన్ ఫిల్లర్ కిందపడటంతో మోడల్ అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కార్యక్రమ నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని పోలీసులు విచారించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
నోయిడాలోని ఫిల్మ్ సిటీ ప్రాంతంలోని ఓ స్టూడియోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా లైటింగ్ ఏర్పాటు చేసిన ఐరన్ ఫిల్లర్ కిందపడటంతో మోడల్ వంశిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు మోడల్ వంశిక చోప్రాగా, గాయపడిన వారిని బాబీ రాజ్‌గా గుర్తించారు. నోయిడాలో జరిగిన ఈ దురదృష్టకర ఫ్యాషన్ షోలో వీరిద్దరూ పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన యువతి గ్రేటర్ నోయిడా గౌర్ సిటీ-2 నివాసి అని తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి కార్యక్రమ నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని పోలీసులు విచారించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ఏడీసీపీ) శక్తి అవస్తీ ఫిలిం సిటీ స్టూడియోలో ఫ్యాషన్ షో సందర్భంగా మోడల్ వంశిక చోప్రా ట్రస్ పడి చనిపోయిందని తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Noida: In an unfortunate incident, a model died after a lighting truss fell on her during a fashion show at Noida Film City on Sunday. one person also got injured in the accident. The victim was identified as Vanshika Chopra, a resident of Gaur City-2, Greater Noida pic.twitter.com/HDivv0VNbN
— AMAN_RAWAT_OFFICIAL (@aman45497) June 12, 2023
ఘటన జరిగిన వెంటనే వంశికను సమీపంలోని కైలాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన బాబీ, వంశిక స్నేహితుడు, ఆగ్రా నివాసి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఫ్యాషన్ షో నిర్వాహకుడిని, లైటింగ్ పనిలో నిమగ్నమైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని శక్తి అవస్థి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం