Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసు.. పరారీలో జబర్దస్త్‌ కమెడియన్‌.. పోలీసుల గాలింపు

జబర్దస్త్‌ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కొందరు కమెడియన్స్ సినిమాల్లో కూడా వరుస అవకాశాలు దర్కించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఐతే మరికొందరు కమెడియన్లు మాత్రం తెరవెనుక అక్రమాలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు..

Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసు.. పరారీలో జబర్దస్త్‌ కమెడియన్‌.. పోలీసుల గాలింపు
Red Sandalwood
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2023 | 9:51 PM

జబర్దస్త్ కామెడీ షో తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కామెడీ షో ద్వారా ఎందరో కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. పలువురు లేడీ గెటప్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కొందరు కమెడియన్స్ సినిమాల్లో కూడా వరుస అవకాశాలు దర్కించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఐతే మరికొందరు కమెడియన్లు మాత్రం తెరవెనుక అక్రమాలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్‌ హరి అలియాస్ హరితపై కేసు నమోదు అయ్యింది. చంటి టీమ్‌లో లేడీ గెటప్‌లు వేసే హరిత తెర వెనుక గట్టుచప్పుడుకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో దాదాపు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. దర్యాప్తులో అతను హరి పేరు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంతో హరికి సంబంధం ఉందని, సరుకును తరలించే ప్లాన్ కూడా అతడిదేనని పోలీసులకు తెలిపాడు. ఈ ఆపరేషన్‌లో హరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ట్రై చేసినప్పటికీ, తమ కళ్లుగప్పి అతను తప్పించుకొని పారిపోయినట్లు పోలీసుల తెలిపారు. దీంతో పోలీసులు హరిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Jabardasth Hari

Jabardasth Hari

కాగా స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడటం హరికి ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా అతడిపై పలుమార్లు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 2021 మే నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో 8 మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐతే జబర్దస్త్‌ హరి అక్కడి నుంచి పరారయ్యాడు. హరికి చాలా మంది స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?