‘కులం బాబూ ! కులం’ ! యూపీ రాజకీయాల్లో బిహారీ పార్టీలు ! పాలిటిక్స్ లో వింతైన కోణాలు

ఎన్నడూ లేని విధంగా యూపీ రాజకీయాల్లో బీహారీ పార్టీలు కూడా తలదూరుస్తున్నాయి. యూపీలో తమ కేడర్ ని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగుతున్నాయి.

'కులం బాబూ ! కులం' ! యూపీ రాజకీయాల్లో బిహారీ పార్టీలు ! పాలిటిక్స్ లో వింతైన కోణాలు
Yogi Adityanath
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 12, 2021 | 5:17 PM

ఎన్నడూ లేని విధంగా యూపీ రాజకీయాల్లో బీహారీ పార్టీలు కూడా తలదూరుస్తున్నాయి. యూపీలో తమ కేడర్ ని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగుతున్నాయి. జనతాదళ్-యూ, ఆర్జేడీ, ఎల్.జె.పీ, హిందుస్థానీ అవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ వంటివి ఉత్తరప్రదేశ్ లోని వివిధ చోట్ల తమ కార్యకర్తలను సమీకరించడం ప్రారంభించాయి. యూపీలో కుల రాజకీయాలు కీలక పాత్ర వహిస్తున్నందున వివిధ సామాజిక వర్గాల మద్దతుతో ఇవి చిన్న పార్టీల నాయకులను శరణు జొచ్చుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఓంప్రకాష్ రాజ్ భర్ నేతృత్వాన గల భాగీదారీ ఆందోళన్ మోర్చా వంటి చిన్న పార్టీలు ఎన్నికల రంగంలోకి దూకడానికి రెడీగా ఉన్నాయి. బిహారీ పార్టీలకు ఉత్తరప్రదేశ్ లో పెద్దగా ఎలెక్టోరల్ బేస్ లేదు. అయినా ఇక్కడి పార్టీలతో జత కట్టడానికి తహతహలాడుతున్నాయి. అంటే ఇక్కడ కులమే ప్రధాన పాత్ర వహిస్తోంది. ఉదాహరణకు నిషాద్ కుల నేత.. బిహారీ మంత్రి ముకేశ్ సహానీ.. యూపీలో తమ కులస్థుల ప్రయోజనాలకోసం శ్రమిస్తున్నారు. ఈ కులస్థులు బందిపోటు రాణి, ఆ తరువాత రాజకీయ నేతగా కూడా మారిన ఫూలన్ దేవిని తమ ఆరాధ్య నేతగా భావిస్తున్నారు. జులై 25 న ఆమె వర్ధంతిని ఘ్జనంగా నిర్వహించాలని సహానీ యత్నించినప్పటికీ ఆ యత్నాలు విఫలమయ్యాయి.

యూపీలో వివిధ చోట్ల ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయాలనీ ‘వీఐపీ’ నిర్ణయించినా పోలీసులు అందుకు అనుమతించలేదు. ఇక మీర్జాపూర్-వారణాసి రీజన్ లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని సహానీ ప్రకటించారు. బీహార్ లో ఈయన పార్టీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారణాసిలో సభ నిర్వహించేందుకు ఈయన చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఫూలన్ దేవిని ‘గ్లోరిఫై’ చేయడానికి ఈ మంత్రి చేసిన యత్నాలు సోషల్ మీడియాలో పలు విమర్శలకు తావిచ్చాయి కాగా-. లోక్ జన శక్తి పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వం లోని సమాజ్ వాదీ పార్టీతో జత కట్టడానికి తహతహలాడుతోంది. ఈ పార్టీ (ఎల్ జె పీ) నేత చిరాగ్ పాశ్వాన్.. ఈ నెల 15 న యూపీలో రోడ్ షోను, ఆశీర్వాద్ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. ఇటీవల ఢిల్లీలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు.హిందుస్తానీ అవామీ మోర్చా నేత, మంత్రి సంతోష్ సుమన్ మంజి ..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసి.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని మీ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad: ఆటోను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని డీకొట్టిన కారు.. ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘డాలర్ స్కామ్’.. సభ బయట విపక్షాల ధర్నా.. పోటీ ‘అసెంబ్లీ’