AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో ‘క్రాంతిసేన’ ఉద్యమం

'హర్తాలిఖ్ తీజ్' అనే పండుగ సందర్భంగా హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో క్రాంతిసేన అనే సంస్థ ఉద్యమాన్ని ప్రారంభించింది.

హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో 'క్రాంతిసేన' ఉద్యమం
Kranti Sena
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 12, 2021 | 5:32 PM

Share

‘హర్తాలిఖ్ తీజ్’ అనే పండుగ సందర్భంగా హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో క్రాంతిసేన అనే సంస్థ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముజఫర్ నగర్ లో ఈ సంస్థ సభ్యులు స్థానిక మార్కెట్లంతా కళ్యా తిరిగి చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. హిందూ మహిళలకు హెన్నాను పెట్టే ఈ వర్గం వారిని పనిలో పెట్టుకోరాదని దుకాణదారులను కోరారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.మా సూచనలను ఇదవరకే ప్రకటించామని, వీటిని తప్పనిసరిగా పాటించాలని ఈ సంస్థ కార్యదర్శి మనోజ్ సైని కోరారు. ఇది కేవలం ముజఫర్ నగర్ కే పరిమితం కాదని ఆయన చెప్పారు. ప్రతి వీధికి, ప్రతి దుకాణానికి వెళ్లి వాకబు చేస్తున్నామని అన్నారు. హెన్నా వేస్తామంటూ హిందూ మహిళలను వారు మభ్యపెట్టి లవ్ జిహాద్ మగ్గు లోకి లాగుతారని.. మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే మేకప్, హెయిర్ స స్టైల్ వంటి పనుల కోసం దుకాణదారులు ముస్లిములను వినియోగించుకోరాదని మనోజ్ కోరారు.

యూపీతో బాటు మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, రాజస్థాన్, ఝార్ఖండ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగ విశేష ప్రాచుర్యంలో ఉంది. శ్రావణ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు వచ్చే ఈ ఫెస్టివల్ సందర్భంగా హిందూ మహిళలంతా రోజంతా ఉపవాసం ఉండి శివ పార్వతులను పూజిస్తారు. తమ వైవాహిక జీవితం ఆనంద ప్రదంగా ఉండేట్టు చూడాలని కోరుతారు. అందుకే ఇలాంటి రాష్ట్రాల్లో ముస్లిములు కొందరు హిందూ మహిళలకు హెన్నా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.అయితే దీనికి కళ్లెం వేస్తూ.. యూపీలో క్రాంతిసేన అనే సంస్థ ఈ విధమైన ప్రచారం చేపట్టింది.. ఇలా దీన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. లవ్ జిహాద్ వంటి సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా తామీ ప్రచారం చేపట్టామని వీరంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Best Index Fund: రిస్క్ తక్కువ.. లాభాలు ఎక్కువ.. మార్కెట్‌లో కొత్తవారికి ఇండెక్స్ ఫండ్స్‌తో మంచి రాబడి..

Andhra Pradesh: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ