కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘డాలర్ స్కామ్’.. సభ బయట విపక్షాల ధర్నా.. పోటీ ‘అసెంబ్లీ’

లోగడ తలెత్తిన గోల్డ్ స్కామ్ మళ్ళీ కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి గుదిబండలా మారింది.. నాడు కేవలం గోల్డ్ మాత్రమే వివాదాస్పదం కాగా ఇప్పుడు డాలర్ కూడా దానికి తోడయింది.

కేరళ అసెంబ్లీని కుదిపేసిన 'డాలర్ స్కామ్'.. సభ బయట విపక్షాల ధర్నా.. పోటీ 'అసెంబ్లీ'
Kerala Cm Pinarayi Vijayan
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 12, 2021 | 5:15 PM

లోగడ తలెత్తిన గోల్డ్ స్కామ్ మళ్ళీ కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి గుదిబండలా మారింది.. నాడు కేవలం గోల్డ్ మాత్రమే వివాదాస్పదం కాగా ఇప్పుడు డాలర్ కూడా దానికి తోడయింది. ఈ స్కామ్ పై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు స్పీకర్ తమను అనుమతించకపోవడంతో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యాన విపక్షాలు సభను బాయ్ కాట్ చేశాయి. అసెంబ్లీ భవనం బయట ధర్నా, ‘పోటీ అసెంబ్లీ’ నిర్వహించాయి. తమ నిరసనలో భాగంగా ఈ వాయిదా తీర్మానాన్ని ఈ పోటీ సభలో ప్రవేశపెట్టాయి. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసులో నిందితులకు కస్టమ్స్ శాఖ షోకాజ్ నోటీసులను జారీ చేసిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి కూడా ప్రమేయం ఉందని కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలతో ప్రతిపక్షాలు ఇక ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం ప్రారంభించాయి. గురువారం సభ ప్రారంభం కాగానే దీనిపై చర్చ జరగాలని, తమ వాయిదా తీర్మాన నోటీసును అంగీకరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు స్పీకర్ ఎం.బి. రాజేష్ అనుమతిని నిరాకరించారు. ఇది కోర్టు పరిశిలనలో ఉందన్నారు. న్యాయ శాఖ మంత్రి పి.రాజీవ్ ఆయనను సమర్థిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటాన బెట్టడానికే చూస్తున్నాయని ఆరోపించారు. అయితే లోగడ ఇలాంటి చాలా సందర్భాల్లో ఈ విధమైన నోటీసులను అనుమతించారని విపక్ష నేత. వి.డీ.సతీశన్ అన్నారు. ముఖ్యమంత్రి ఏ తప్పు చేయకపోతే తనను తాను నిరూపించుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన అన్నారు.

అయితే స్పీకర్ మాత్రం అనుమతించేది లేదని కరాఖండిగా చెప్పడంతో కాంగ్రెస్ ఆధ్వర్యాన ప్రతిపక్ష సభ్యులంతా.. సీఎం రాజీనామా చేయాలనీ నినాదాలు చేస్తూ సభను బాయ్ కాట్ చేశారు, ఆ తరువాత అసెంబ్లీ భవన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. అటు కేరళ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో దెబ్బ కూడా తగిలింది. గోల్డ్ కేసులో ముఖ్యమంత్రిని ఇరికించేందుకు ఈడీ యత్నిస్తోందని, అందువల్ల మొదట దీనిపై కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీని ఏర్పాటు చేస్తున్నామని లోగడ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈడీకి అనువుగా హైకోర్టు నిర్ణయం తీసుకోవడం విశేషం. పైగా విజయన్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి సైతం నోటీసులు జారీ చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూ రాసిన మాజీ ఉద్యోగి.. పరువు నష్టం దావాతో షాకిచ్చిన కంపెనీ.. ఎంతో తెలుసా?

Watch Video: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?