Viral Video: కోర్టు ప్రాంగణంలో అండర్ ట్రయల్ ఖైదీపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి
బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు కోర్టు ప్రాంగణంలోనే శుక్రవారం (డిసెంబర్ 15) కాల్చి చంపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్ కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాట్నా సిటీ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ శర్మ సోదరుడి హత్య కేసులో ఛోటే సర్కార్ అలియాస్ అభిషేక్ కుమార్ అనే వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా..
పట్నా, డిసెంబర్ 15: బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు కోర్టు ప్రాంగణంలోనే శుక్రవారం (డిసెంబర్ 15) కాల్చి చంపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్ కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాట్నా సిటీ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ శర్మ సోదరుడి హత్య కేసులో ఛోటే సర్కార్ అలియాస్ అభిషేక్ కుమార్ అనే వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం అతడిని బేవుర్ జైలు నుంచి దనాపుర్ కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఛోటే సర్కార్ అలియాస్ అభిషేక్ కుమార్ పై ఇద్దరు వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి దూసుకొచ్చి కాల్పులు జరిపారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉన్న జనం భయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో అభిషేక్ కుమార్ మృతి చెందాడు. అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలతోనే అభిషేక్ కుమార్‌పై దాడి చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అందిన సమాచారం మేరకు బిహార్‌లోని సికందర్‌పూర్‌కి చెందిన రాజన్ సింగ్ కుమారుడు ఛోటే సర్కార్ అలియాస్ అభిషేక్ కుమార్. రాజన్ సింగ్ ముగ్గురు కుమారుల్లో చిన్నవాడు. బిహార్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై అరడజను దాడులు, స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నౌబత్‌పూర్ మసోధి జెహనాబాద్ పోలీస్ స్టేషన్‌లలో అతనిపై హత్య ఆరోపణలు ఉన్నాయి.
#WATCH | Assailants shot dead an undertrial prisoner brought by police to Patna's Danapur court today. Two accused arrested pic.twitter.com/WLoMVmSqJh
— ANI (@ANI) December 15, 2023
గతంలో కూడా ఇదేమాదిరి రెండు హత్యలు
ఛోటే సర్కార్‌ను కోర్టులో హాజరుపరిచే సమయంలో హత్య చేసినట్లే.. బిహార్ సినిమా హాల్ యజమాని నిర్భయ్ సింగ్ హత్య కేసులో దోషిగా ఉన్న అమిత్ కుమార్ కూడా జార్ఖండ్‌లోని డియోఘర్ కోర్టు ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. గతేడాది జనవరి 18న కిడ్నాప్ కేసులో కోర్టులో హాజరయ్యేందుకు నలుగురు సాయుధ పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతేడాది ఏప్రిల్ 15న ప్రయాగ్‌రాజ్‌లో మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. పోలీసులు ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా.. జర్నలిస్టుల వేషధారణలో వచ్చిన ముగ్గురు దుండగులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న అతిక్, అతని సోదరుడిని అతి సమీపం నుంచి కాల్చిచంపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.