AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Elections: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 7సార్లు పోటీ చేసిన నందకిశోర్‌కు షాక్!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చింది. అంతా ఊహించినట్లుగానే బీజేపీ 101 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మంగళవారం (అక్టోబర్ 14) ఎన్నికలకు తన మొదటి జాబితాను విడుదల చేసింది.

Bihar Elections: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 7సార్లు పోటీ చేసిన నందకిశోర్‌కు షాక్!
Bjp Candidates List
Balaraju Goud
|

Updated on: Oct 14, 2025 | 3:57 PM

Share

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చింది. అంతా ఊహించినట్లుగానే బీజేపీ 101 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మంగళవారం (అక్టోబర్ 14) ఎన్నికలకు తన మొదటి జాబితాను విడుదల చేసింది. జాబితా ప్రకారం, నంద్ కిషోర్ యాదవ్‌కు నిరాశ ఎదురైంది. రత్నేష్ కుష్వాహాకు పాట్నా సాహిబ్ నుండి పోటీ చేసే అవకాశం లభించింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కమలం పార్టీ. మిగిలిన సీట్లకు అభ్యర్థులను రెండవ జాబితాలో ప్రకటిస్తారు.

నంద్ కిషోర్ యాదవ్ తో పాటు, మంత్రి మోతీలాల్ ప్రసాద్ టికెట్ ఎన్నికల బరి నుంచి తప్పించారు. రామ్‌సురత్ రాయ్ టికెట్ ఔరాయ్‌కు టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ, ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే సివాన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. జెడియు మాజీ ఎంపి సునీల్ కుమార్ పింటు తిరిగి బీజేపీలోకి వచ్చారు. ఆయన సీతామర్హి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు తన టికెట్ కట్ అయిన తర్వాత, నంద్ కిషోర్ మాట్లాడుతూ, “నేను బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. పార్టీ నాకు చాలా ఇచ్చింది. పార్టీతో నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు. కొత్త తరానికి స్వాగతం.” అంటూ పేర్కొన్నారు. “పాట్నా సాహిబ్ అసెంబ్లీ ప్రజలు నన్ను వరుసగా ఏడుసార్లు గెలిపించారు. బీజేపీ అభ్యర్థిగా నాపై చూపిన ఆప్యాయత, ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని అన్నారు.

మరోవైపు, బీజేపీ ఖజౌలి నుండి అరుణ్ ప్రసాద్‌ను పోటీకి దింపింది. ఈ సీటు ఉపేంద్ర కుష్వాహాకు వెళ్తుందని చర్చ జరిగింది. తారాపూర్ నుండి టికెట్ దక్కించుకున్న తర్వాత, సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, “2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ కృషి, NDA ఐక్యత, అందరి కృషి కారణంగా, ప్రతి సీటులో విజయం సాధిస్తాము” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, బీహార్‌లో ఈసారి రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ నవంబర్ 11న జరుగుతుంది. మొదటి దశకు నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థులు అక్టోబర్ 17 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..