AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్డర్‌లో అడ్డంగా నిలబడతాం.. ఒక్కరంటే ఒక్కరిని రాష్ట్రంలోకి రానివ్వం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

బార్డర్లో అడ్డంగా నిలబడతాం, ఒక్కరంటే ఒక్కర్ని కూడా మా రాష్ట్రంలోకి రానివ్వం.. ఒకవేళ వచ్చినా వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదు.. అని ఒట్టేసుకుంది అసోమ్ ప్రభుత్వం. భారతీయులుగా బతుకుదామని వచ్చే బంగ్లాదేశ్‌ వాళ్లను గట్టిగా హెచ్చరించింది. భారత పౌరసత్వం పొందడానికి ఆధార్ కార్డులను కలిగి ఉన్న అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ముందుజాగ్రత్త చర్యగా సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని నోటిఫికేషన్‌కు అసోం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బార్డర్‌లో అడ్డంగా నిలబడతాం.. ఒక్కరంటే ఒక్కరిని రాష్ట్రంలోకి రానివ్వం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం
Assam Cm Himanta Biswa Sarma
Balaraju Goud
|

Updated on: Aug 22, 2025 | 8:25 AM

Share

అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి, బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టింది అసోం రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌ తర్వాత ఈమేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ. అక్టోబర్ నుండి, అస్సాంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు లభించవని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం (ఆగస్టు 21) జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత తెలిపారు. అంటే ఇకపై 18 ఏళ్లకు పైబడ్డ వారెవరికీ ఆధార్ కార్డ్ ఇవ్వకూడదు.. అనేది అసోం సీఎం స్టేట్‌మెంట్ సారాంశం. కానీ, ఎస్‌సీలకు, ఎస్టీలకు, తేయాకు తోటల్లో పనిచేసే వర్కర్స్‌కు మాత్రం మినహాయింపునిచ్చింది.

సరిహద్దు భద్రత కోసం, అక్రమ వలసల్ని అడ్డుకోవడం కోసం కఠినంగా వ్యవహరించక తప్పదంటోంది అసోమ్ సర్కార్. ఇకపై ఏ ఒక్క బంగ్లాదేశీయుడు అసోంలోకి జొరబడి, ఆధార్ కార్డ్ తీసుకుని, మన దేశ పౌరుడిగా చెలామణీ కావడానికి వీల్లేదని, డోర్లు మూసివేస్తున్నామని ప్రకటించింది హేమంత్ సర్కార్. భారత పౌరసత్వం పొందడానికి ఆధార్ కార్డులను కలిగి ఉన్న అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ముందుజాగ్రత్త చర్యగా సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని నోటిఫికేషన్‌కు అసోం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మిగతా సామాజికవర్గాలకు చెందిన అర్హులు ఎవరైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే నెలరోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. 18 ఏళ్లు నిండి, ఆధార్‌ కోసం ఇంతవరకూ రిజిస్టర్ చేసుకోనివాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సీఎం హిమంత శర్మ. సెప్టెంబర్‌ తర్వాత ఆధార్ నమోదు అంత ఈజీ కాదని, అత్యవసరమైతే తప్ప ఎన్‌రోల్‌మెంట్ కుదరదని తేల్చేసింది అసోమ్ ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ ఓకే చేసి, ఫారెనర్స్ ట్రిబ్యునల్ నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటే తప్ప ఆధార్ కార్డు జారీ కాదు. 2001 జనాభా లెక్కల ప్రకారం అసోమ్‌లో 20 లక్షలమందికి పైగా బంగ్లాదేశీయులున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య కోటి దాటిందనేది మరొక అంచనా. సెప్టెంబర్ 2024లో, నాలుగు అస్సాం జిల్లాలలో వారి అంచనా వేసిన జనాభా కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డుదారులు ఉన్నారని తేలింది. ఈ జిల్లాలు – బార్పేట, ధుబ్రి, మోరిగావ్, నాగావ్ – బెంగాలీ మాట్లాడే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..