మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడుతున్నారా.. అయితే ఆ బంపర్ ఆఫర్ ఏంటో చూసేయండి
టెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ కొత్త కొత్త ఆఫర్లు ఇస్తునే ఉంటాయి.
టెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ కొత్త కొత్త ఆఫర్లు ఇస్తునే ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రస్తుతం 5జీ వాడుతున్న కస్టమర్లకు అపరిమిత డేటా వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం డేటాపై విధిస్తున్న రోజువారీ పరిమితిని ఎత్తి వేసింది. ఇప్పుడు ఉన్న 4జీ ప్లాన్లకు వర్తించే డేటా లిమిట్ 5జీ కస్టమర్లకు వర్తించనుంది. ప్రస్తుతం జియో సైతం తమ 5జీ కస్టమర్లకు వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తోంది.5జీ హ్యాండ్ సెట్ కలిగి 5జీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కనీసం రూ.239, అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.
అయితే ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు సైతం ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. కస్టమర్లు రోజువారీ డేటా పరిమితి గురించి ఆలోచించకుండా ఇంటర్నెట్‌ను ఆనందించడంతో పాటు ఆన్‌లైన్ సేవల్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రవేశ ఆఫర్‌ను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో సంస్థలు పోటా పోటీగా తమ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వెళుతున్నాయి. 5జీ సేవల ఆరంభం నుంచే జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత డేటా సదుపాయయాన్ని అందిస్తోంది. మరోవైపు ఇటీవలే పోస్ట్ పెయిడ్ వినియోగదారులనూ ఆకర్షించేందుకు జియో ప్లస్ పేరిట ప్లాన్లను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ 5జీ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాను ప్రకటించింది. వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్‌ను పొందొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..