Amit Shah: తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు అండగా కేంద్రం.. త్వరలోనే పరిశీలనకు కేంద్ర బృందాలు
అర్నబ్ తుఫాను సృష్టించిన బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి, కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందిస్తాయన్నారు.

అర్నబ్ తుఫాను సృష్టించిన బీభత్సం, దాని ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు..ఆయా రాష్ట్రాల్లో నమోదైన నష్టం, చేపడుతున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని,ఈ విపత్కర సమయంలో బాధిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. విపత్తు నిర్వహణ, రక్షణ , పునరావాస పనుల నిమిత్తం కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలను తక్షణమే అందిస్తామని స్పష్టం చేశారు.
యుద్ధపాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
తుపాను ధాటికి ప్రభావితమైన జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. రోడ్లపై కూలిపోయిన చెట్లను, విద్యుత్ స్తంభాలను తొలగించి రవాణాను పునరుద్ధరిస్తున్నారు.విద్యుత్ సరఫరా, మంచినీటి వసతులను త్వరితగతిన సరిదిద్దేందుకు అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
త్వరలోనే పరిశీలనకు కేంద్ర బృందాలు
తుపాను కారణంగా సంభవించిన పంట నష్టం, ఆస్తి నష్టం మౌలిక వసతుల ధ్వంసం తీవ్రతను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాయని అమిత్ షా ముఖ్యమంత్రులకు తెలిపారు. కేంద్ర బృందాలు సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సాయం విడుదల చేయనున్నట్లు తెలిపారు..ప్రకృతి విపత్తుల వేళ ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్టానికి తగ్గించడమే తమ ప్రాధాన్యమని, బాధిత కుటుంబాలకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
పోస్ట్ చూడండి..
In the wake of Cyclone Arnab, spoke with the Chief Ministers of Andhra Pradesh, Puducherry, Odisha and Chhattisgarh and assured them of every assistance to mitigate the hardship of the people in the face of the disaster. NDRF and SDRF teams have sprung into action and are continuing rescue and relief operations on a war footing. IMCTs will soon be sent to assess the impact and further assistance required.
Government of India stands with the people with resolute commitment.
— Amit Shah (@AmitShah) October 29, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
