AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం

తెలంగాణ నిరుద్యోగులకు TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 MPSO, ASO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.1,06,990 వరకు జీతం పొందే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు అర్హతలు, వయోపరిమితి, ఫీజులు, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలుసుకోండి..

డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
TGPSC MPSO, ASO Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 29, 2026 | 2:15 PM

Share

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 27, 2026 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను 2027 జనవరిలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జోన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు

  • జోన్-1 (కాళేశ్వరం) పోస్టుల సంఖ్య: 12
  • జోన్-2 (బాసర) పోస్టుల సంఖ్య: 14
  • జోన్-3 (రాజన్న) పోస్టుల సంఖ్య: 15
  • జోన్-4 (భద్రాద్రి) పోస్టుల సంఖ్య: 17
  • జోన్-5 (యాదాద్రి) పోస్టుల సంఖ్య: 7
  • జోన్-6 (చార్మినార్) పోస్టుల సంఖ్య: 25
  • జోన్-7 (జోగులాంబ) పోస్టుల సంఖ్య: 12

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టును ప్రధానంగా తీసుకుని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే సంబంధిత కోర్సు ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల చదువులో కనీసం ఒక సంవత్సరమైనా స్టాటిస్టిక్స్ పేపర్ చదివి ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు ఆధారంగా గరిష్ఠంగా ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది. మాజీ సైనికులు, అర్హులైన ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఈ ఫీజు రూ.500గా పేర్కొన్నారు. పరీక్ష ఫీజు రూ.80గా ఉంటుంది. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష ఫీజు మినహాయింపు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం..

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) లేదా ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-2లో స్టాటిస్టిక్స్ (డిగ్రీ స్థాయి) 150 ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు జనరల్ స్టడీస్‌తో పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరీక్షకు సిద్ధం కావాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు పే స్కేల్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు, వర్తించే ఇతర ప్రయోజనాలు నియామక నిబంధనల ప్రకారం ఉంటాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • తొలిసారి దరఖాస్తు చేసుకునేవారు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి TGPSC ID పొందాలి.
  • ఇప్పటికే OTR చేసుకున్నవారు తమ TGPSC ID, పుట్టిన తేదీ, OTP సహాయంతో లాగిన్ కావాలి.
  • వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
  • అవసరమైన వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • వర్తించే ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 30, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 27, 2026.
  • రాత పరీక్ష: జనవరి 2027 (తాత్కాలికం)
  • హాల్‌టికెట్ల విడుదల: పరీక్షకు 7 రోజుల ముందు

టీజీపీఎస్సీ మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!