AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఈ లిమిట్ దాటితే బాదుడే.. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్..

ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికి షాక్. దీపావళి వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ షాకిచ్చింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ప్యూయల్, రవాణా ఛార్జీలకు పరిమితికి మించి క్రెడిట్ కార్డు ఉపయోగించే అదనంగా 1 శాతం ఛార్జీ విధించనుంది.

SBI: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఈ లిమిట్ దాటితే బాదుడే.. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్..
Sbi Creadit Card
Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 2:01 PM

Share

ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్. క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. కొన్ని ట్రాన్సాక్షన్లకు అదనపు ఛార్జీలు విధించనుంది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు, ట్రావెల్ ఛార్జీలు, యుటిలిటీ బిల్లుల లావాదేవీలపై 1 శాతం అదనపు ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సేవా రుసుంల్లో కీలక మార్పులు చేసింది. రూ.30 వేలు దాటి ట్రాన్సాక్షన్లు చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారు ముందుగానే ఈ చార్జీల గురించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్త పడవచ్చు. ఏయే కార్డులపై ఇవి ప్రభావితం చూపనున్నాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అదనపు చార్జీల బాదుడు

చాలామంది పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటారు. ఇక ట్రాన్స్‌పోర్ట్ లాంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపు కోసం కూడా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంటారు. ఇక నుంచి వీటికి రూ.30 వేలు దాటి చేస్తే అదనంగా 1 శాతం ఛార్జీలు పడతాయి. పెట్రోల్, డీజిల్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేవారిపై దీని ప్రభావం పడనుంది. అక్టోబర్ 27వ తేదీన చార్జీలకు సంబంధించి ఎస్బీఐ నోటీస్ జారీ చేయగా.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో ప్యూయల్ ట్రాన్సాక్షన్ రూ.50 వేలు దాటితే 1 శాతం అదనపు ఛార్జీలు పడతాయి. అంటే రూ.55 వేలు దాటితే రూ.550 ఛార్జీ పడనుండగా.. రూ.75 వేలు దాటితే రూ.750 పడుతుందని చెప్పవచ్చు. ఎంసీసీ 5172, 5541,5542,5983 కింద గుర్తించిన పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల ట్రాన్సాక్షన్లు ఒక బిల్లింగ్ సైకిల్‌లో రూ.50 వేలు దాటితే మొత్తం ఫ్యూయల్ ఖర్చుపై 1 శాతం ట్యాక్స్ పడుతుందని ఎస్బీఐ తెలిపింది.

రవాణా ఛార్జీలకు రూల్స్ ఇవే..

ఇక ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలకు రూ.30 వేలు దాటితే 1 శాతం రుసుంలు విధిస్తారు. రూ.30 వేలు దాటిన ప్రతీ ట్రాన్సాక్షన్‌కు ఇవి వర్తిస్తాయి. అంటే రూ.35 వేల ట్రాన్సాక్షన్ చేస్తే రూ.350 అదనంగా ఛార్జీలు పడతాయి. ముఖ్యంగా ఇంధన కొనుగోళ్లు, రవాణా ఛార్జీల కోసం క్రెడిట్ కార్డు వాడేవారిపై ఇవి ప్రభావితం చూపనున్నాయి. దీంతో క్రెడిట్ కార్డు ఉపపయోగించేవారు వీటి గురించి ముందుగానే అవగాహన కలిగి ఉండటం మంచిదని చెప్పవచ్చు. ఇవి తెలుసుకోకుండా లావాదేవీలు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us