AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!

ధన త్రయోదశి వచ్చేస్తోంది. దీనినే ధంతేరాస్ అని కూడా అంటారు. ఇక ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు గోల్డ్ కొనుగోలు చేయడం వలన సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు. ఇక 2026 సంవత్సరంలో ధన త్రయోదశి వస్తుంది. అయితే ఈ రోజు బంగారం కొనుగోలు చేసే సమయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. అవి ఏవి అంటే?

Samatha J
|

Updated on: Oct 29, 2026 | 1:02 PM

Share
చాల మంది  ఈ రోజున ఖాళీ చేతులతో బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తుంటారు. కానీ అలా ఎప్పుడూ వెళ్లకూడదు.  ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడాని వెళ్తున్న సమయంలో తప్పకుండా పర్సు తీసుకొని అందులో కాస్త కుంకు, పసుపు, రూపాయి బిల్ల పెట్టుకొని వెళ్లాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తుందంట.

1 / 5
 అంతే కాకుండా కొంత మంది అప్పు చేసి బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడూ కొనుగోలు చేయకూడదంట. అప్పు చేసి బంగారం కొనుగోలు చేయడం మంచిది కాదు. మీ దగ్గర లక్ష్మీదేవి ఉంటనే, అంటే మీ వద్ద డబ్బు ఉంటేనే బంగారం కొనుగోలు చేయాలంట. లేకపోతే ఇది మీకు ఆర్థిక పరమైన నష్టాలను తీసుకొస్తుంది.

2 / 5
అలాగే ఎప్పుడైనా సరే ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తే ఆనందంగా నవ్వుకుంటూ వెళ్లాలి. నలుపు రంగు బట్టలు వేసుకొని ఎప్పుడూ బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లకూడదు. లక్ష్మీదేవికి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఇష్టం కాబట్టి, అలాంటివి వేసుకొని వెళ్లడం వలన లక్కు కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

3 / 5
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు అయితే తప్పకుండా సమయం చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాహుకాలంలో బంగారం కొనుగోలు చేయకూడదు. బంగారం కొనుగోలుకు వెళ్లే సమయంలో, కొనే సమయంలో తప్పకుండా రాహు కాలం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఉదయం సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిది. మళ్లీ తిరిగి సాయంత్రం లక్ష్మీ పూజకు ముందు కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది.

4 / 5
అదే విధంగా బంగారు కొనుగోలు చేసిన వెంటనే కింద పెట్టడం చేయకూడదు. పేపర్లో ఇస్తే దానిని తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగు క్లాత్‌లో చుట్టి, దానిని అలాగే ఇంటికి తీసుకొచ్చి బీరువాలో పెట్టకుండా పూజగదిలో పెట్టి పూజ చేసిన తర్వాత బీరువాలో పెట్టడం వలన సంపద రెట్టింపు అవుతుందంట. నోట్ : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపించలేదు. ఇది కేవలం నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!

దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!

ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.

ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..

కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ

అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే

నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..

విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..